Seetimaarr: ఓటీటీలోకి గోపిచంద్ సినిమా.. దసరాకు సీటీమార్ మూవీ స్ట్రీమింగ్..
టాలెంటెడ్ హీరో గోపిచంద్ చాలా కాలం తర్వాత సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. గౌతమ్ నంద మూవీ తర్వాత.. గోపీచంద్.
టాలెంటెడ్ హీరో గోపిచంద్ చాలా కాలం తర్వాత సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. గౌతమ్ నంద మూవీ తర్వాత.. గోపీచంద్.. డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకుంది. మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపిచంద్ నటించగా.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా నటించింది. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఇక తాజాగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సీటీమార్ విడుదల కానుంది. దసరా కానుకగా ఈ మూవీ ఈ నెల 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగనా సూర్యవంశీ, రెహమాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి, ప్రీతి ఆశ్రని, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే.. నాలుగేళ్ల క్రితం గోపిచంద్ నటించిన ఆరడుగల చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్వీట్..
Ready for a #SeetiMaarr welcome? Watch our film #SeetiMaarrOnHotstar streaming from Oct 15th only on @DisneyPlusHS #SeetimaarrOnHotstar pic.twitter.com/D97lsVWgFd
— Gopichand (@YoursGopichand) October 8, 2021
Also Read: Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నేను రూడ్ కాదంటూ సిరిపై చిందులు..
Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..
Janhvi Kapoor: తగ్గేదే లే అంటున్న జాన్వీ కపూర్ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి
Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు