Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నేను రూడ్ కాదంటూ సిరిపై చిందులు..
ప్రతివారం మాదిరిగానే ఈవారం కూడా నామినేషన్స్ తర్వాతి రోజు బిగ్‌బాస్ ఇంట్లో హీట్ కొనసాగుతూనే ఉంది. ఐదు వారాలు పూర్తి చేసుకుని
ప్రతివారం మాదిరిగానే ఈవారం కూడా నామినేషన్స్ తర్వాతి రోజు బిగ్‌బాస్ ఇంట్లో హీట్ కొనసాగుతూనే ఉంది. ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరోవారంలోకి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే.. ఇంట్లో నామినేష్స్ చర్చలు మొదలుపెట్టేశారు కంటెస్టెంట్స్. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం పెద్ద రచ్చ జరిగింది.
ఇక నిన్నటి ఎపిసోడ్లో ఎప్పటిలాగే మన త్రిమూర్తులు జెస్సీ, సిరి, షణ్ముఖ్‌లు నామినేషన్స్ గురించి సమావేశమయ్యారు. అలాగే బిగ్ బాస్ .. బీబీ బొమ్మల ఫ్యాక్టరీ.. అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు… ఇందులో బ్లూ టీమ్‌లో మానస్, సన్నీ, యానీ మాస్టర్ ఉండగా.. ఎల్లో టీమ్ లో షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ, రెడ్ టీమ్ లో విశ్వ, శ్రీరామ్, ప్రియ ఉండగా.. గ్రీన్ టీమ్ లో రవి, లోబో, శ్వేత ఉన్నారు. ఇక సిరి, కాజల్ ఫ్యాక్టరీ మేనేజర్… సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. రెడ్ అండ్ గ్రీన్ టీమ్స్ కు మేనేజర్స్ గా సిరిని.. బ్లూ.. ఎల్లో టీమ్స్ కి కాజల్ ను మేనేజర్ గా నియమించారు. ఇరువురు టీం మేంబర్స్ తీసుకువచ్చిన బొమ్మలలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. కెప్టెన్స పోటీ కావాలంటే.. ప్రతి టీమ్ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారుచేయాల్సి ఉంటుంది. గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్ పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ వస్తుంది. వాటిని తీసుకుని బొమ్మలను రెడీ చేయాల్సి ఉంటుంది. దీంతో బొమ్మల్లో కాటన్ సరిగ్గా పెట్టకపోతే రిజెక్ట్ చేస్తున్నారని మానస్ అన్నాడు. ఇక ఆ తర్వాత యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్ధం జరిగింది. సంచాలకులుగా ఉన్నవారు బొమ్మల కౌంటింగ్ సరిగా చేయాలని.. బజర్ మోగిన తర్వాత బొమ్మలను తెస్తే నేను ఒప్పుకోను అంటూ యానీ మాస్టర్ చెప్పుకొచ్చింది. దీంతో మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం అంటూ సిరి వాదించింది. ఇంకేముంది యానీ మాస్టర ఉగ్రరూపం దాల్చింది. నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు అంటూ మండిపడింది. దీంతో బాగా అయిన సిరి.. గేమ్ ఫేర్ గా అడనప్పటికీ.. నేను ఒక టీంకే సపోర్ట్ ఇస్తున్నా అంటున్నారు. ఇకపై అలానే ఆడతాను.. ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను అని సిరి అనగా.. షణ్ముఖ్ సర్ది చెప్పాడు.
Also Read: Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..
Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు