Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి తెలియని ఇండియన్ ఉంటారా..! నటుడిగా ఆయన సాధించిన కీర్తి ఎందరికో స్ఫూర్తి.

Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..
Amitabh Bachchan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 12, 2021 | 10:19 PM

Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి తెలియని ఇండియన్ ఉంటారా..! నటుడిగా ఆయన సాధించిన కీర్తి ఎందరికో స్ఫూర్తి. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ తన 79వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అలాగే కోట్లాదిమంది అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికీ ఏడాదికి మూడు నాలుగు సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. వయసుకు తగ్గ పాత్రలను చేస్తూనే .. మరోవైపు  స్టార్ హీరోల సినిమాలో కీలకపాత్రల్లో కూడా నటిస్తున్నారు బిగ్ బి. అంతే కాదు అమితాబచ్చన్ ఈ వయసులో కూడా అత్యధిక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్‌కు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బి 79 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌లో మంచి జరగాలని సలీం ఖాన్ కోరుకున్నారు. అలాగే సినిమాలకు బిగ్ బి రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఆయన అన్నారు. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే చాలా పనిచేశారని, ఎనలేని స్టార్‌డమ్‌ని సాధించారని, అందువల్ల ఆయన ఇప్పుడు తన వయస్సుని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు… అమితాబ్ బచ్చన్ ఇప్పుడు పదవీ విరమణ చేయాలి అని సూచించారు. ఆయన ఈ జీవితంలో కావాల్సినంతా సాధించాడు. ఒక వ్యక్తి తన కోసం కొన్ని సంవత్సరాల జీవితాన్ని కూడా ఉంచుకోవాలి. అమితాబ్ బచ్చన్ వృత్తిపరంగా అద్భుతమైన ఇన్నింగ్స్ చేశారు. ఇప్పుడు ఆయన తప్పనిసరిగా పదవీ విరమణ తీసుకోవాలి అని సలీం ఖాన్ అన్నారు. దాదాపు 10 సినిమాల్లో బిగ్ బితో కలిసి పనిచేశారు సలీం ఖాన్. ఇక ఇప్పుడు సలీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు దారితీస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Janhvi Kapoor: తగ్గేదే లే అంటున్న జాన్వీ కపూర్ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి

Jabardasth Varsha: లంగా ఓణి అందాలతో కవ్విస్తోన్న వర్ష ఫోటో గ్యాలరీ

Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!