Pushpa 2: సోషల్ మీడియాలో పుష్పరాజ్ అరాచకం.. ఇక ట్రైలర్ వస్తే బీభత్సమే.. థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పరాజ్ ఈసారి థియేటర్లలో ఎలాంటి బీభత్సం సృష్టించనున్నాడో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట పుష్పగాడి మాస్ జాతర ట్రెండ్ అవుతుంది.

పుష్ప 2..పుష్పరాజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పేరు. గత మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పుష్పరాజ్ ఊరమాస్ నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. గతంలో పుష్ప వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు పుష్ప 2పై హైప్ ఎక్కువగానే ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుతూ మేకర్స్ కూడా ప్రమోషన్స్ షూరు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ క్రమంలో కొన్ని రోజులుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు బన్నీ. మరోవైపు సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వస్తూ మూవీ స్థాయిని పెంచుతుంది. ఇక టీజర్ తోనే ఈసినిమా ఎలా ఉంటుందో ముందే చెప్పేశాడు సుకుమార్. గంగమ్మ తల్లి గెటప్ లో బన్నీ లుక్ అదిరింది. దీంతో ఈసారి పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ఇటు సౌత్.. అటు నార్త్ లో రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండా నెట్టింట ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయితే పరిస్థితి ఎలాంటి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 17న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ పై దాదాపు నెల రోజులుగా వర్క్ చేస్తున్నారట సుకుమార్.
ఈ సినిమాలో ట్రైలర్ తోపాటు శ్రీలీల స్పెషల్ సాంగ్ కూడా హైలెట్ కానుందట. గతంలో ఊ అంటావా మావ అంటూ ఓ ఊపు ఊపేసింది సమంత. ఇప్పుడు పుష్ప 2లో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల కలిసి స్టెప్పులతో బీభత్సం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన వారం గ్యాప్ లోనే స్పెషల్ సాంగ్ సైతం రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నెట్టింట పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.