AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు సార్లు లవ్‌లో ఫెయిలయ్యా.. అంతా మన మంచికేనంటున్న స్టార్ హీరోయిన్..!

తమన్నా అంటే వెంటనే గుర్తుకొచ్చేది గ్లామర్ షో. ఎక్కడికొచ్చినా.. ఏం చేసినా కెమెరా కళ్లు తనపై తప్ప పక్క వాళ్ల మీదకు వెళ్లకూడదని మెంటల్‌గా ఫిక్సైపోయారు మిల్కీ బ్యూటీ.

రెండు సార్లు లవ్‌లో ఫెయిలయ్యా.. అంతా మన మంచికేనంటున్న స్టార్ హీరోయిన్..!
Tollywood
Praveen Vadla
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 21, 2024 | 7:28 PM

Share

తమన్నా అంటే వెంటనే గుర్తుకొచ్చేది గ్లామర్ షో. ఎక్కడికొచ్చినా.. ఏం చేసినా కెమెరా కళ్లు తనపై తప్ప పక్క వాళ్ల మీదకు వెళ్లకూడదని మెంటల్‌గా ఫిక్సైపోయారు మిల్కీ బ్యూటీ. అందుకే ఈ మధ్య అందాల ఆరబోతలో పిహెచ్‌డీ పూర్తి చేసారు. 18 ఏళ్ళ కెరీర్‌లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కనబెట్టేస్తున్నారు తమన్నా.. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్‌లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్సైపోయారు. పబ్లిక్ ఈవెంట్‌లోనూ తమన్నా ఓ రేంజ్ గ్లామర్ షో చేస్తున్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్యూటీ గ్లామర్ కూడా డబుల్ అవుతుంది. అందాల ఆరబోతకు మిల్కీ బ్యూటీ ఎప్పుడూ విరుద్ధం కాదు.. కానీ అందులో హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్.. లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పుడన్నీ ఓకే అంటున్నారు. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా.. సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్. గతేడాది వచ్చిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్‌లే దీనికి నిదర్శనం. అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా.. ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేసారు. ఇక హాట్ ఫోటోషూట్స్‌కు అయితే లెక్కే లేదు.. వారానికి రెండు కొత్త ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. కెరీర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నాకు కూడా తెలుసు. అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ. ఈ మధ్య ఎక్కడికి వచ్చినా ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఈవెంట్‌కు వస్తున్నారు.

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

ఇదిలా ఉంటే తాజాగా తన లైఫ్‌లోని రెండు లవ్ స్టోరీస్ గురించి ఓపెన్ అయ్యారు తమన్నా. ఈ రెండు కూడా ఫెయిల్యూర్ కథలే. ఒకటి చిన్నపుడు లవ్ స్టోరీ అని.. అప్పుడు మెచ్యూరిటీ లేక వదిలేసానని చెప్పుకొచ్చారు మిల్కీ బ్యూటీ. మరోటి మాత్రం హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నపుడు ఒకరితో ప్రేమలో పడ్డానని.. కానీ ఆ వ్యక్తితో లాంగ్ టైమ్ రిలేషన్ వర్కవుట్ కాదని వదిలేసినట్లు తెలిపారు. తన ప్రేమకు ఆ వ్యక్తి కరెక్ట్ కాదని భావించినట్లు తెలిపారు తమన్నా. ప్రస్తుతం విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు తమ్మూ. త్వరలోనే ఈ ఇద్దరి పెళ్లి జరగబోతుందని ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది.

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి