Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి నుంచి మరో అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ”ఏముంది రా” లిరికల్ వీడియో
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ టైప్ ఆఫ్ ఇంట్రస్ట్ ఉంటుంది. ఈ యంగ్ హీరో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య(Naga Shaurya) సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ టైప్ ఆఫ్ ఇంట్రస్ట్ ఉంటుంది. ఈ యంగ్ హీరో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న తెరకెక్కిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రింద విహారి'(Krishna Vrinda Vihari). ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం సమ్మర్ రేసులో మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ ‘వర్షంలో వెన్నెల’ మెలోడి హిట్ గా నిలిచింది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మెలోడి మళ్ళీమళ్ళీ పాడుకునేలా వుండటంతో పాటు నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ చూడముచ్చటగా అలరించింది.
ఈ చిత్రం నుంచి రెండో పాట ”ఏముంది రా” లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. గాయకుడు హరిచరణ్ పాడిన ఈ పాటని ఇన్ స్టంట్ గా హిట్ అయ్యేలా కంపోజ్ చేశారు మహతి స్వర సాగర్. ప్లజంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో వినడానికి హాయిగా అనిపిస్తున్న ఈ పాటకి అంతే చక్కని సాహిత్యం అందించారు హర్ష. లిరికల్ వీడియోలో చూపించిన విజివల్స్ కూడా బ్యూటీఫుల్ గా వున్నాయి. పాటలో నాగశౌర్య, షిర్లీని ఆగ్రహారానికి తీసుకురావడం, ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించడం, హల్దీ ఫంక్షన్ మొదలుకొని పెళ్లి, సీమంతం, పిల్లలు..ఇలా హ్యాపీ మూమెంట్స్ ని పాటలో చూపించారు. డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.