AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major : అడవి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి.. తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో అడవి శేష్. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.

Major : అడవి శేష్ పాన్ ఇండియా మూవీ 'మేజర్' ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే
Major
Rajeev Rayala
|

Updated on: May 04, 2022 | 6:48 PM

Share

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి.. తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో అడవి శేష్(Adivi Sesh). నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా అడవి శేష్ నటిస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ మేజర్. ఇది అడవి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్'(Major ). శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘మేజర్’ ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో ని చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంది. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు వీడియో చూస్తే అర్ధమౌతుంది. రెండు భాషలలో విడివిడిగా చూపించిన సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా వున్నాయి. వార్, ఎటాక్, యాక్షన్, రోమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు