Dulquer Salman : కన్నడ ప్రజలకు సారీ చెప్పిన దుల్కర్ సల్మాన్.. ఎందుకంటే..
మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా తెలుగు, మలయాళం భాషలలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన నిర్మించిన లోక చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలో కన్నడ ప్రజలకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు చెప్పారు.

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న హీరో దుల్కర్ సల్మాన్. తెలుగు, మలయాళం భాషలలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అటు హీరోగా బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్న దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన లోకా చాప్టర్ 1: చంద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ జంటగా నటించారు. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఓవైపు పాజిటివ్ టాక్, మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా.. ఇప్పుడు అనుహ్యంగా వివాదంలో పడింది. అయితే ఈ సినిమాలో కర్ణాటక రాజధాని బెంగుళూరు గురించి నెగిటివ్ గా చూపించారని, కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫెయిర్ నిర్మాణ సంస్థ నిర్మించిన సూపర్ హీరో చిత్రం ‘లోకా’ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కథ బెంగళూరులో జరుగుతుంది. సినిమాలో చాలా కన్నడ సంభాషణలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో బెంగుళూరు అమ్మాయిల గురించి వచ్చిన ఓ డైలాగ్ ఇప్పుడు కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో లోకా చిత్రంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా దుల్కర్ సల్మా్న్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది.
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
“మా నిర్మాణం ‘లోకా: చాప్టర్ 1’లో ఒక పాత్ర చెప్పిన సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మేము గ్రహించాము. వేఫెయిర్ ఫిల్మ్స్‌లో మేము ప్రజలకు మొదటి స్థానం ఇస్తాము. కానీ ఇప్పుడు మీ ఆగ్రహానికి కారణమైన పదం గురించి మేము మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాము. ఆ డైలాగ్ వెంటనే తొలగిస్తాము.. లేదా మారుస్తాము.. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. ” అంటూ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..







