AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు శాండ్‌విచ్‌లు అమ్మింది.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతుంది.. బిజినెస్ రంగంలోనూ సత్తా చాటుతోన్న హీరోయిన్..

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న తారలు కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కొందరు సినిమాల్లోకి రాకముందు రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ లో వర్క్ చేశారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకప్పుడు శాండ్‌విచ్‌లు అమ్మేది. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలోనే అగ్రకథానాయిక. అంతేకాదు.. వ్యాపారరంగంలోనూ సత్తా చాటుతుంది.

అప్పుడు శాండ్‌విచ్‌లు అమ్మింది.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతుంది.. బిజినెస్ రంగంలోనూ సత్తా చాటుతోన్న హీరోయిన్..
Shraddha Kapoor
Rajitha Chanti
|

Updated on: Sep 02, 2025 | 7:09 PM

Share

సినీరంగుల ప్రపంచం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ చాలా మంది తారలు గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కొందరు చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. మరికొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పెద్ద స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఒకప్పుడు విదేశాల్లో శాండ్‌విచ్‌లు అమ్మేది. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటుంది. అలాగే వ్యాపారరంగంలోనూ రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు.. లెజెండరీ విలన్ శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్. శ్రద్ధ అమెరికాలో కళాశాల చదువు మానేసింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

అదే సమయంలో స్టార్‌బక్స్‌లో బారిస్టాగా పనిచేసింది. ఐన్‌స్టీన్ బ్రదర్స్ బాగెల్స్‌లో శాండ్‌విచ్‌లను కూడా అమ్మింది. సంవత్సరాల తరువాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన సొంత ఆభరణాల బ్రాండ్‌కు సహ వ్యవస్థాపకురాలు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేయడానికి బోస్టన్ విశ్వవిద్యాలయంలో చేరింది. అయితే మొదటి సంవత్సరంలోనే చదువున వదిలేసింది. నటనపై ఆసక్తితో భారతదేశం రావాలనుకుంది. తీన్ పట్టి సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని పంపించిందని తెలిపింది. కస్టమర్లకు కాఫీ తయారు చేయడం నుండి బేగెల్స్ వడ్డించడం వరకు ఈ అనుభవాలు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ముందు ఆమెకు స్వాతంత్ర్యం నేర్పించాయి. ఆషికి 2 సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

చిచ్చోరే, ఓకే జాను, హారర్-కామెడీ స్త్రీ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక ఇటీవల విడుదలైన స్త్రీ 2 సినిమా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 884.45 కోట్లు వసూలు చేసి, 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలే ఆమె పాల్మోనాస్ అనే డెమి-ఫైన్ జ్యువెలరీ బ్రాండ్‌ను సహ-స్థాపించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

ఇవి కూడా చదవండి : Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..