AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam Trailer: రామ్ ఎవరు.? సీత ఎక్కడుంది..? అఫ్రీన్ అన్వేషణ దేనికి..? ఆసక్తికరంగా సీతారామం ట్రైలర్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సీతారామం. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హనురాఘవాపుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Sita Ramam Trailer: రామ్ ఎవరు.? సీత ఎక్కడుంది..? అఫ్రీన్ అన్వేషణ దేనికి..? ఆసక్తికరంగా సీతారామం ట్రైలర్
Sita Ramam
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2022 | 12:37 PM

Share

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సీతారామం(Sita Ramam). అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హనురాఘవాపుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలి సినిమాతోనే మంచి అభిరుచికలిగిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు హనురాఘవాపుడి. ఆ తర్వాత అందమైన ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా దుల్కర్ హీరోగా సీతారామం సినిమాతో రాబోతున్నారు. యుద్ధం రాసిన ప్రేమ కథ అనే ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని అందమైన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మొదటి నుంచి చెప్తున్నట్టే ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నేపధ్యసంగీతం కూడా చాలా వినసొంపుగా ఉంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది ఈ ట్రైలర్. ఈ సినిమాలో రష్మిక తో పాటు, హీరో సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ , గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
రంజాన్ ఉపవాసం.. ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్
రంజాన్ ఉపవాసం.. ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి
అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి
వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ..
వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ..
అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత,,
అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత,,
రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు..
రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు..
100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే 20 టికెట్లు మాత్రమే తెగాయ్
100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే 20 టికెట్లు మాత్రమే తెగాయ్
దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
IND vs ZIM: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన గంభీర్..
IND vs ZIM: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన గంభీర్..