Chiranjeevi : ‘అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్లు నాకు వస్తే నేను చెయ్యను’.. మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్(Aamir Khan)నటిస్తున్న తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా.. అమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.

Chiranjeevi : 'అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్లు నాకు వస్తే నేను చెయ్యను'.. మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్
Megastar Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2022 | 7:55 PM

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్(Aamir Khan)నటిస్తున్న తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా.. అమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అందాల భామ కరీనా కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుండగా అక్కినేని యంగ్ హీరో  నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. పాన్ ఇండియా మూవీ రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. లాల్ సింగ్ చడ్డా సినిమాను తెలుగులో మెగాస్టార్ చినజీవినే సమర్పిస్తున్నారు.

లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. చిరు మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ మూవీ. సీన్ తరువాత సీన్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి అన్నారు. అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్లు నాకు వస్తే నేను చెయ్యను. జనానికి ఏమి చేస్తే క్లాప్ కొడతారు, జై జై లు కొడతారు అనేది నేను చూస్తాను అలాంటి సినిమాలు మాత్రమే చేస్తాను. కానీ అప్పుడప్పుడు నా ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయి. స్క్రిప్ట్ మీద అవగాహన కోసం వర్క్ షాప్ నిర్వహిస్తే మంచిది దాని రిజల్ట్ వేరు, మన వాళ్ళు కూడా ఖచ్చితంగా వర్క్ షాప్ లు నిర్వహించాలి అన్నారు చిరు. అలాగే టాలీవుడ్ దర్శకులపై సెటైర్ల వేశారు మెగాస్టార్ చిరంజీవి.  షూటింగ్ లొకేషన్లో డైలాగులు అప్పటికప్పుడు రాసి వడ్డిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. నటీనటులు డైలాగులు నేర్చుకోవాలా..? లేక నటన మీద దృష్టి పెట్టాలా.? అంటూ కామెంట్ చేశారు చిరంజీవి. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి