AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారప్ప జోరు తగ్గేలోగానే మరో సినిమాతో రానున్న వెంకటేష్.. ఆ సినిమాను కూడా ఓటీటీలోనే..

సీనియర్ హీరో వెంకటేష్ దూకుడు పెంచారు. ఇటీవలే నారప్పగా ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నారప్ప జోరు తగ్గేలోగానే మరో సినిమాతో రానున్న వెంకటేష్.. ఆ సినిమాను కూడా ఓటీటీలోనే..
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2021 | 10:22 AM

Share

Drishyam 2: సీనియర్ హీరో వెంకటేష్ దూకుడు పెంచారు. ఇటీవలే నారప్పగా ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటీటీ వేదికగా విడుదలైన నారప్ప సినిమా మంచి టాక్‌‌‌‌‌‌తో దూసుకుపోతోంది. తమిళ్‌‌‌‌‌లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్‌‌‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన నారప్ప సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఒరిజినల్ వర్షన్ ఎక్కడా గుర్తురాకుండా వెంకటేష్ తన నటనతో కట్టిపడేశారు. ఇక ఈ సినిమాతోపాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం2’ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమా షూటింగ్‌‌‌ను శరవేగంగా పూర్తిచేశారు. ఇక ఈ సినిమాను కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే  దృశ్యం2 ను డిస్నీ హాట్‌‌‌‌స్టార్‌‌‌లో విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. భారీ మొత్తానికి దృశ్యం 2 సినిమాను హాట్‌‌‌స్టార్ కొనుగోలుచేసిందని తెలుస్తోంది.

అయితే ముందుగా దృశ్యం2 సినిమాను లెట్‌‌‌గా విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించారు. కానీ ఇప్పుడు నారప్ప దూకుడు చూసి వీలైనంత తొందరగా సినిమాను స్ట్రీమింగ్‌‌‌‌కు ఉంచాలని చూస్తున్నారట. ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలైన పెద్ద సినిమా నరప్పే.. ఇప్పుడున్న ఊపులోనే దృశ్యం2 సినిమాను కూడా విడుదల చేస్తే సినిమాకు ప్లెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతో దృశ్యం2ను సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఇక దృశ్యం మొదటి పార్ట్‌‌‌లో వెంకటేష్‌‌‌కు జోడిగా మీనా నటించింది. ఇప్పుడు దృశ్యం2లో కూడా మీనా వెంకీ సరసన నటించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Alia Bhatt: ముంబైకి పయనమైన ముద్దుగుమ్మ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆలియా..

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

Hero Vijay: ఉప్పొంగిన అభిమానం.. హీరో విజయ్‌‌పై తమ ప్రేమను చాటుకున్న కర్నాటక ఫ్యాన్స్.. నిలువెత్తు విగ్రహం

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!