Alia Bhatt: ముంబైకి పయనమైన ముద్దుగుమ్మ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆలియా..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను..

Alia Bhatt: ముంబైకి పయనమైన ముద్దుగుమ్మ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆలియా..
Alia Bhatt
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 26, 2021 | 8:46 AM

Alia Bhatt: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నాడు జక్కన. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకొని షూటింగ్‌‌‌‌లో పాల్గొంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా కనిపించనుంది ఆలియా. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రమోషనల్ సాంగ్‌‌‌‌‌తో పాటు ప్యాచ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుందట. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మొత్తం వర్క్‌‌‌‌ను కంప్లీట్ చేసిందట ఈ చిన్నది.

షూటింగ్ పూర్తవ్వడంతో ఆలియా తిరిగి ముంబైకి పయనమైంది. మళ్లీ ఈ చిన్నది త్వరలోనే హైదరాబాద్ కు రానుంది. దసరా ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆలియా భట్ కనీసం వారం నుండి పది రోజుల పాటు హైదరాబాద్ లోనే గడపాల్సి ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌గా దూసుకుపోతున్న ఆలియా ఆర్ఆర్ఆర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవ్వనుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆలియాకు ఉన్న క్రేజ్‌‌‌‌‌తో బాలీవుడ్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hero Vijay: ఉప్పొంగిన అభిమానం.. హీరో విజయ్‌‌పై తమ ప్రేమను చాటుకున్న కర్నాటక ఫ్యాన్స్.. నిలువెత్తు విగ్రహం

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

Salaar Movie: భారీ ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ తారలను దింపనున్నారట..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే