Hero Vijay: ఉప్పొంగిన అభిమానం.. హీరో విజయ్‌‌పై తమ ప్రేమను చాటుకున్న కర్నాటక ఫ్యాన్స్.. నిలువెత్తు విగ్రహం

దళపతి విజయ్. ఈ పేరు విన్నా, విజువల్ చూసినా ఆయన అభిమానులకు బాడీలో కరెంట్ పాస్‌ అవుద్ది. ఆయనపై ఫ్యాన్స్‌కున్న అభిమానం అలాంటిది.

Hero Vijay: ఉప్పొంగిన అభిమానం.. హీరో విజయ్‌‌పై తమ ప్రేమను చాటుకున్న కర్నాటక ఫ్యాన్స్.. నిలువెత్తు విగ్రహం
Hero Vijay
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 26, 2021 | 10:24 AM

దళపతి విజయ్. ఈ పేరు విన్నా, విజువల్ చూసినా ఆయన అభిమానులకు బాడీలో కరెంట్ పాస్‌ అవుద్ది. ఆయనపై ఫ్యాన్స్‌కున్న అభిమానం అలాంటిది. ఇక విజ‌య్ అన‌గానే కోలీవుడ్ హీరో అనేది నిన్నటి మాట‌. ప్యాండ‌మిక్ టైమ్‌లో మాస్టర్ మూవీ క‌లెక్షన్లు చూశాక విజ‌య్ ‘ప్యాన్ ఇండియా స్టార్’ అనే మాట‌కే అంద‌రూ ఫిక్సయ్యారు. ఇదిలా ఉంటే తమిళనాడులో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తర్వాత అంతటి అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్‌కు ఒక్క తమిళనాడులోనే కాదు, ఏపీ, కర్ణాటకలో విజయ్ ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా, కర్ణాటక అభిమానులు విజయ్‌ మర్చిపోలేని ఓ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన దళపతి విజయ్ అభిమానులు, విజయ్ విగ్రహాన్ని రూపొందించి చెన్నైకి తీసుకువచ్చి బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని విజయ్ మక్కల్ ఇయక్కం పన్నైయూర్ కార్యాలయంలో శాశ్వతంగా ఉంచుతామని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడులోని అభిమానులు విజయ్‌ విగ్రహాన్ని చూడటానికి తరలివస్తున్నారు. తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇది విజయ్‌ జీవిత కాలం గుర్తుంటుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

దళపతి విజయ్‌ సౌత్‌ ఇండియా టాప్‌ హీరోల సరసన ఎప్పుడో చేరిపోయారనే టాక్‌ ఇండస్ట్రీలో నడుస్తోంది. రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, చిరంజీవి లాంటి హీరోలతో సమానంగా విజయ్‌ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘బీస్ట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీనికి అనిరుధ్ సంగీతం అందించారు. చెన్నై నగర శివార్లలోని ఓ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Also Read: : తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ

పోలీసులం అంటూ ఇన్నోవా ఆపారు, తనిఖీలు అంటూ అందర్నీ దింపారు.. కట్ చేస్తే

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?