AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలపై ఫిర్యాదులు అందాయని తిరుమల తిరుపతి....

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ
Tirumala
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2021 | 7:17 AM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలపై ఫిర్యాదులు అందాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. టీటీడీ కల్యాణోత్సవం, రూ.300 టికెట్లు బుక్ చేస్తామని మోసం చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. టికెట్లు ఇస్తామని చెన్నైకి  రేవతి ట్రావెల్స్ డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా   ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. శ్రీవారి దర్శన టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా పుష్పయాగం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి మాట్లాడుతూ ఆల‌యంలో జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయన్నారు. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌ని చెప్పారు. ఇందులో తులసి, మల్లి, కనకాంబరం, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 18 రకాలకు చెందిన పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారన్నారు.

Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

ఈ రాశివారికి అవసరానికి డబ్బులు చేతికందుతాయి.. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి