New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

తెలంగాణలో రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌. ఇవాళ్టీ నుంచి అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు జారీ అవుతాయి.  3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు...

New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..
Ration Card Details
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2021 | 6:28 AM

తెలంగాణలో రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌. ఇవాళ్టీ నుంచి అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు జారీ అవుతాయి.  3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 53,123 మంది అర్హులైన కార్డుదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ SP రోడ్డులోని జోరాస్టియన్‌ క్లబ్‌లో రేషన్‌ కార్డులను అర్హులకు అందించనున్నారు. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లాలోని మేడ్చల్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో 30055 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందించనున్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయనున్నారు. నిజానికి జూన్ నెలలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు.

డూప్లికేట్‌లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించారు. వారు వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి: Passport : పాస్‌పోర్ట్ కావాలంటే ఎక్కడికో వెళ్లనవసరం లేదు.. దగ్గరలోని పోస్టాఫీస్ సందర్శిస్తే సరిపోతుంది..

Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ