Passport : పాస్‌పోర్ట్ కావాలంటే ఎక్కడికో వెళ్లనవసరం లేదు.. దగ్గరలోని పోస్టాఫీస్ సందర్శిస్తే సరిపోతుంది..
Passport: విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) నిర్వహిస్తున్న పాస్‌పోర్ట్ సేవా
Passport: విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) నిర్వహిస్తున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజల సౌలభ్యం కోసం మరో సౌకర్యం కల్పించారు. పాస్‌పోర్ట్ కోసం సమీప పోస్టాఫీసులలో అప్లై చేసుకునే పద్దతిని ప్రారంభించారు. దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ లేదా పోస్టాఫీసు CSS కౌంటర్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా తెలిపింది. “ఇప్పుడు మీరు సమీప పోస్టాఫీసు CSS కౌంటర్లో పాస్‌పోర్ట్ కోసం నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం సమీప పోస్టాఫీసును సందర్శించండి. ” అని తెలిపింది.
మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు పాస్‌పోర్ట్ కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. తరువాత ఆన్‌లైన్ ఫీజును చెల్లించి ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీకు తేదీ తెలుస్తుంది. ఆ రోజు మీరు ఎంచుకున్న పత్రాలతో సమీప పోస్టాఫీసుకు వెళ్ళాలి.
ఏ పత్రాలు అవసరం పాస్‌పోర్ట్ పొందడానికి, మీరు జనన ధృవీకరణ పత్రం, హైస్కూల్ మార్క్ షీట్, ఎలక్షన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, నోటరీ నుంచి తయారు చేసిన అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
రెటీనా స్కానింగ్ ద్వారా ధృవీకరణ జరుగుతుంది అన్ని పత్రాలను పోస్ట్ ఆఫీస్‌కు తీసుకెళ్లిన తరువాత వాటి ప్రామాణికత తనిఖీ చేస్తారు. పత్రాలు సరైనవిగా తేలితే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్శన సమయంలో దరఖాస్తుదారుడి వేలిముద్ర, రెటీనా స్కాన్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ 15 రోజులలో పూర్తవుతుంది. తరువాత మీకు పాస్‌పోర్ట్ లభిస్తుంది.
अब अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर पासपोर्ट के लिए पंजीकरण और आवेदन करना सरल हो गया है। अधिक जानकारी के लिए, नज़दीकी डाकघर पर जाएँ। #AapkaDostIndiaPost pic.twitter.com/iHK0oa9lKn
— India Post (@IndiaPostOffice) July 24, 2021