AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముచ్చటగా మూడోసారి మహేష్ సరసన చెన్నైచంద్రం.. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా..

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ త్రిష. తెలుగులో జూనియర్ హీరోలదగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు వరుసగా అందరి సరసన సినిమాలు..

ముచ్చటగా మూడోసారి మహేష్ సరసన చెన్నైచంద్రం.. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా..
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2021 | 6:09 PM

Share

Trisha: ఒకప్పుడు టాలీవుడ్‌‌‌లో ఓ రేంజ్‌‌‌‌లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ త్రిష. తెలుగులో జూనియర్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు వరుసగా అందరిసరసన చేస్తూ స్టార్ హీరోయిన్‌‌‌‌గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు తగ్గించి తమిళ్ సినిమాల పై దృష్టిపెట్టింది ఈ చిన్నది. ఇటీవలే 96 సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో త్రిష నటనకు అవార్డులు సైతం దక్కాయి. అయితే మొదట త్రిషను మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఏ కారణం చేతనో తెలియదు కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. ఆమె ప్లేస్‌‌‌‌‌లో కాజల్ అగర్వాల్‌‌‌‌‌ను తీసుకున్నారు. అలాగే నట సింహంనందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాలోనూ  హీరోయిన్ గా త్రిషను సంప్రదించారు. కానీ ఈ ఆఫర్ ను త్రిష సున్నితంగా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా త్రిషను అందుకుంటున్నారట గురూజీ. మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌‌లో వచ్చిన అతడు సినిమాలో త్రిషనే హీరోయిన్. దాంతో ఇప్పుడు చేయబోయే సినిమాలో రెండో హీరోయిన్‌‌‌‌గా త్రిషను ఎపిక చేశారట త్రివిక్రమ్. ఇక మొదటి హీరోయిన్‌‌‌గా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. పూజహెగ్డే, నివేదా థామస్ పేర్లతోపాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. ఇక ఇప్పటికే త్రిషతో సంప్రదింపులు కూడా జరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: తన అన్నయ్య గురించి చెబుతూ ఎమోషనల్ అయిన బన్నీ.. వీడియో

‘ఛత్రపతి సూరీడు’ ఇప్పుడు ఎలా ఉన్నడో చూశారా..? షాకింగ్ లుక్.. వైరల్ అవుతోన్న ఫోటో..

Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి