AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో

Sonu Sood: బాలీవుడ్ నటుడు సోను సూద్ లాక్ డౌన్ నుంచి బాధితులకు అందిస్తున్న సాయంతో.. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే..ఈ వెండి తెర..

Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో
Sonu Sood
Surya Kala
|

Updated on: Jul 25, 2021 | 4:54 PM

Share

Sonu Sood: బాలీవుడ్ నటుడు సోను సూద్ లాక్ డౌన్ నుంచి బాధితులకు అందిస్తున్న సాయంతో.. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే..ఈ వెండి తెర విలన్… నిజ జీవితంలో హీరో. కరోనా సమయంలో కష్టంలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి దేశ వ్యాప్తంగా దేవుడయ్యాడు. ఎవరికైనా అవసరం అని తెలిస్తే తనవంతు సాయం అందిస్తున్న సోనూ సూద్ ఎక్కడి వెళ్లినా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఓ వైపు తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సోనూ సూద్ మరోవైపు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంటాడు.. ఇప్పటికే బట్టలు కుట్టి దర్జీగా , సూపర్ మార్కెట్ లోని సరుకులు డెలివరీ చెస్ వ్యక్తిగా ఇలా రకరకాల పనుల వీడియోలు షేర్ చేశాడు సోను.. అయితే తాజాగా సోనూ సూద్ మిల్క్ మ్యాన్ గా మారాడు. తాజాగా సోనూ రిక్షాను తొక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.

పశుగ్రాసం తీసుకుని వెళ్తున్న రైతు రిక్షాని సోనూ సూద్ తొక్కాడు. రైతు పశుగ్రాసం తీసుకుని వెళ్తున్న రిక్షాలో అతనిని కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు సోనూసూద్. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో అభిమానులను అలరిస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు సోనూ

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

Also Read:  Ashadam Mehendi: పెద్దలమాట చద్దిమూట.. ఆషాడంలో గోరింటాకును మహిళలు పెట్టుకోవడంలో శాస్త్రీయ కోణం..

నా కొడుకు సింగర్ కావాలని అనుకోవడం లేదు.. అతడు ఇకపై భారత్‌లో నివసించడు: సోనూ నిగమ్‌