Ashadam Mehendi: పెద్దలమాట చద్దిమూట.. ఆషాడంలో గోరింటాకును మహిళలు పెట్టుకోవడంలో శాస్త్రీయ కోణం..
Ashadam Mehendi: ఆషాడం వచ్చిందంటే చాలు మగువల చేతులు మందారం రంగులో మెరుస్తుంటాయి. ఆషాడం లో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.. అసలు ఈ గోరింటాకు
Ashadam Mehendi: ఆషాడం వచ్చిందంటే చాలు మగువల చేతులు మందారం రంగులో మెరుస్తుంటాయి. ఆషాడం లో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.. అసలు ఈ గోరింటాకు పుట్టడానికి హిందూ పురాణాల్లో అనేక కథలున్నాయి.. ఇక స్త్రీ సౌభాగ్య చిహ్నంగా భావింపబడుతున్న ఈ గోరింటాకు పెట్టుకోవోడం వలన మహిళలకు అనేక ప్రయోజనాలున్నాయని అంటున్నారు.
ఇక శాస్త్రపరంగా చూస్తే గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ట్నాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయని పెద్దల నమ్మకం. ఇక గోరింటాకు పెట్టుకున్న స్త్రీలోని హార్మోన్ల పని తీరు చక్కగా ఉంటుంది. దీంతో దేహం కూడా చక్కగా, సున్నితంగా, అందముగా ఉంటుంది.
నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. మిగతా సమయాల్లో పెట్టుకునే గోరింటాకును ఈ ఆషాఢ మాసములో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంది. ఇక ఆషాడం లో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలుచెప్పడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందట. ఆషాఢ మాసము వర్షాకాలం. ఈ కాలములో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్లు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతే కాదు, ఇంతటి అద్భుతమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకుతో..
అయితే కాలంలో వచ్చిన మార్పులతో పాటు.. గోరింటాకు స్థానంలో ఇప్పుడు హెన్నా కోన్లు వచ్చాయి. మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకుని, వాళ్ళు చెప్పినట్లు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి. మన పెద్దలు ఎంతో దూరదృష్టితో కాలానికి అనుగుణంగా శరీరం పనిచేసే తీరు.. వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి ఏర్పరచిన సంప్రదాయాల్లో ఒకటి ఆషాడం లో గోరింటాకు.
Also Read: Wrestler Priya Malik: అంతర్జాతీయ క్రీడా యవనికపై మరోసారి భారతీయ జెండా రెపరెప.. భారత్‌కు బంగారు పతకం