Wrestler Priya Malik: అంతర్జాతీయ క్రీడా యవనికపై మరోసారి భారతీయ జెండా రెపరెప.. భారత్‌కు బంగారు పతకం

Wrestler Priya Malik: హంగేరీ లో జరుగుతున్నా రెజ్లింగ్ పోటీల్లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం నమోదు చేసింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ ను..

Wrestler Priya Malik: అంతర్జాతీయ క్రీడా యవనికపై మరోసారి భారతీయ జెండా రెపరెప..  భారత్‌కు బంగారు పతకం
Priya Malik
Follow us
Surya Kala

|

Updated on: Jul 25, 2021 | 4:10 PM

Wrestler Priya Malik: హంగేరీ లో జరుగుతున్నా రెజ్లింగ్ పోటీల్లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం నమోదు చేసింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో73 కేజీల విభాగంలో విజయం సాధించి బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది.

టోక్యోలో జరుగుతున్నా ఒలంపిక్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన మర్నాడే రెజ్లర్ ప్రియా మాలిక్ మరో సంచలన విజయం నమోదు చేసి.. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతీయ పతాకాన్ని రెపరెపలాడించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరోవైపు టోక్యో ఒలంపిక్స్ లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు. ఈ విభాగంలో భారత్ కు మంచి విజయాలను నమోదు చేస్తుందని పలువురు భావిస్తున్నారు.

Also Read: Kerala Fish Molee Curry: కేరళ స్టైల్ లో కొబ్బరి పాలతో రుచికరమైన చేపల కూర తయారీ విధానం..