Tokyo Olympics 2020 Highlights: టీటీలో 3వ రౌండ్‌లోకి ఎంటరైన మణికా బాత్రా; బాక్సింగ్‌లో సత్తా చాటిన మేరీకోమ్

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 25, 2021 | 6:37 PM

Tokyo Olympics 2020 Live Updates: టోక్యో ఒలింపిక్స్‌లో మూడవ రోజు భారత క్రీడాకారులు పలు పోటీల్లో బరిలోకి దిగనున్నారు. మేరీకోమ్, సింధు కూడా తమ ప్రయాణాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు.

Tokyo Olympics 2020 Highlights: టీటీలో 3వ రౌండ్‌లోకి ఎంటరైన మణికా బాత్రా; బాక్సింగ్‌లో సత్తా చాటిన మేరీకోమ్
Mary Kom And Batra

Tokyo Olympics 2020, Day 3: వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతంతో రెండవ రోజే భారత్ ఒలింపిక్స్‌లో తన పతకాల ఖాతాను తెరిచింది. నేడు (ఆదివారం) భారత అథ్లెట్లు పలు క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్‌ ప్లేయర్‌లైన మేరీ కోమ్‌, పీవీ సింధు, జి సథియన్‌ రంగంలోకి దిగనున్నారు. ఆదివారం, భారత ఆటగాళ్లు బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, ఈతలో తమ ప్రతిభను చాటనున్నారు. ఇవే కాకుండా సెయిలింగ్, బోటింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌లో బరిలోకి దిగనున్నారు.

ఒలింపిక్స్‌లో నేడు భారత అథ్లెట్ల షెడ్యూల్ ఉ.6:30కి జిమ్నాస్టిక్స్‌ మహిళల ఆల్‌రౌండ్‌ క్వాలిఫికేషన్‌ ఉ.6:30కి రోయింగ్‌ లైట్‌వెయిట్‌ డబుల్స్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ ఉ.6:30కి షూటింగ్‌ పురుషుల స్కీట్‌ క్వాలిఫికేషన్‌- బజ్వా, మీరజ్‌ ఉ.7:10కి బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ – పీవీ సింధు ఉ.9:30కి షూటింగ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫికేషన్‌ ఉ.10:30కి టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ ఉ.10:30కి టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ.1:30కి బాక్సింగ్‌ మహిళల ఫ్లైవెయిట్‌- మేరీకోమ్‌ రౌండ్‌ఆఫ్‌ 32 మ.3 గంటలకు భారత్‌ Vs ఆస్ట్రేలియా హాకీ మ్యాచ్‌ మ.3:30కి స్విమ్మింగ్‌ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌- మానా పటేల్‌ మ.3:30కి స్విమ్మింగ్‌ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ హీట్స్‌- సాజన్‌ ప్రకాశ్‌ సా.4:20కి స్విమ్మింగ్‌ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌- శ్రీహరి నటరాజ్‌

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jul 2021 06:18 PM (IST)

    తొలిరౌండ్ లోనే ఓడిన బాక్సర్ మనీష్ ..

    అంచనాలతో టోక్యో ఒలంపిక్స్ లో అడుగు పెట్టిన బాక్సర్ మనీష్ కౌశిక్ ఓటమిపాలయ్యారు. 63 కేజీల విభాగంలో తొలిరౌండ్ లోనే ఓటమిపాలయ్యాడు. 63 కేజీల విభాగంలో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన లూక్ మెక్‌కార్మక్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో మనీష్ కౌశిక్ పరాజయం పొందాడు. నిజానికి మనీష్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

  • 25 Jul 2021 06:12 PM (IST)

    టోక్యో ఒలంపిక్స్ లో ఆస్ట్రేలియా చేతిలో భారీ తేడాతో భారత హాకీ జట్టు ఓటమి.

    టోక్యో ఒలంపిక్స్ లో భారత మెన్ హాకీ జట్టు.. చేజేతులారా ఓటమి కొని తెచ్చుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోటీలో భారత హాకీ జట్టు ఓటమిపాలైంది. పెనాల్టీ కార్నర్ రూపంలో అవకాశాలు వచ్చినా భారత క్రీడాకారులు అవి గోల్స్ కింద మలచడంలో విఫలమై భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఏడు గోల్స్ చేయగా.. భారత తరపున ఏకైక గోల్ ను దిల్ ప్రీత్ సింగ్ చేశాడు.

    మొదటి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారీ పరాజయం పొందింది. నిజానికి భారత జట్టుకు గోల్స్ చేసే పలు అవకాశాలు పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చాయి. ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకి గోల్ చేసే అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో టీమిండియా ఆలస్యం చేసింది. తర్వాత అది గోల్ గా మలచినా లెక్కలోకి రాలేదు. అనంతరం ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుంది. భారత్ పై అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ.. ఆట మొదలైన 10 నిమిషాల్లోనే మొదటి గోల్ చేసింది. మొదటి క్యార్థర్ ముసిగేసమయానికి ఆస్ట్రేలియా 21వ, 23వ, 26వ నిమిషాల్లో గోల్స్ చేసి 4-0 తేడాతో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.

    మూడో క్వార్టర్‌లో భారత జట్టు తరుపున దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కడే, ఆట 34వ నిమిషంలో ఏకైక గోల్చేశాడు. మూడో క్వార్ట్రర్ లో ఆస్ట్రేలియా రెండు గోల్స్ , నాలుగో క్వార్ట్రర్ లో మరో గోల్ చేసి 7-1 తేడాతో భారత పై భారీ తేడా తో ఆస్ట్రేలియా విజయబావుటా ఎగరవేసింది.

  • 25 Jul 2021 03:06 PM (IST)

    రోయింగ్‌లో భారత్‌ శుభారంభం

    టోక్యో ఒలింపిక్స్‌ రోయింగ్‌ విభాగంలో భారత్‌ శుభారంభం చేసింది. లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెపికేజ్‌లో రోవర్స్‌ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో భారత్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

    సానియా జోడీ ఓటమి..

    మహిళల టెన్నిస్‌ విభాగంలో సానియా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా-అంకిత రైనా జోడీ లిడ్‌మిలా-నదియా(ఉక్రెయిన్‌) జంట చేతిలో ఓడిపోయింది.

    ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో నిరాశ..

    మహిళల 10 మీ ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని 12 వ స్ధానంలో నిలిచారు. దీంతో భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

  • 25 Jul 2021 01:53 PM (IST)

    బాక్సింగ్: మేరీకోమ్ విజయం

    మహిళల ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) 32 వ రౌండ్‌లో భారత్ స్టార్ బాక్సర్ మేరీకోమ్ విజయం సాధించింది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మిగ్యులినా హెర్నాండెజ్ గార్సియాను 4-1తో ఓడించి, తదుపరి రౌండ్‌లోకి ఎంటరైంది.

  • 25 Jul 2021 01:42 PM (IST)

    టేబుల్ టెన్నిస్: మణికా బాత్రా విజయం

    మహిళల సింగిల్స్ రౌండ్ లో మణికా బాత్రా 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7తో ఉక్రెయిన్ క్రీడాకారిణి మార్గరైటా పెసోట్స్కా పై గెలిచింది దీంతో బాత్రా 3వ రౌండ్‌లోకి ప్రవేశించింది.

  • 25 Jul 2021 01:07 PM (IST)

    టేబుల్ టెన్నిస్: జ్ఞానేశ్వ‌ర‌న్ పోరాటం ముగిసింది

    ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో ఇండియా ప్లేయర్ జ్ఞానేశ్వ‌రన్ స‌త్య‌న్ ఓడిపోయాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో త‌న కంటే త‌క్కువ ర్యాంక్ క్రీడాకారుడు, హాంకాంగ్‌కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో పరాజయం పాలయ్యాడు.

  • 25 Jul 2021 11:26 AM (IST)

    షూటింగ్ - నిరాశపరిచిన దీపక్ కుమార్, దివ్యాన్ష్ పన్వర్

    దీపక్ కుమార్, దివ్యన్ష్ పన్వర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. 624.7 పాయింట్లతో దీపక్ 26 వ స్థానంలో, 622.8 పాయింట్లతో దివ్యాన్ష్ పన్వర్ 32 వ స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన యాంగ్ హొరాన్ 632.7 పాయింట్లతో ఒలింపిక్ రికార్డు సృష్టించాడు.

  • 25 Jul 2021 10:59 AM (IST)

    స్కేట్ బోర్డింగ్

    ఈ ఏడాది ప్రవేశపెట్టిన స్కేట్ బోర్డింగ్ క్రీడలో జపాన్‌కు చెందిన యుటో హారిగోమ్ తొలి బంగారు పతకాన్ని అందుకుని రికార్డు నెలకొల్పాడు.

  • 25 Jul 2021 10:12 AM (IST)

    తొలి రౌండ్‌లోనే ఓడిన యాష్లే బార్టీ

    మహిళల టెన్నిస్‌ ప్రపంచ నెంబర్‌ వన్‌ యాష్లే బార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. సారా సోరిబ్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 6-4, 6-3తో వరుస సెట్లలో యాష్లే బార్టీ ఓడిపోయింది. మరోవైపు ఒలింపిక్స్‌లో సింగిల్స్ నుంచి ఇంగ్లండ్‌ స్టార్‌ ఆండీ ముర్రే గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే, డబుల్స్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.

  • 25 Jul 2021 09:51 AM (IST)

    నిరాశ పరిచిన సానియా జోడీ

    మహిళల డబుల్స్‌ టెన్సిస్‌లో తీవ్ర నిరాశే ఎదురైంది. సానియా- అంకితా రైనా జోడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ఉక్రెయిన్‌ జోడీతో జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో 6-0, 6-7(0), 8-10తో ఓడిపోయి నిరాశ పరిచారు.

  • 25 Jul 2021 09:21 AM (IST)

    సెయిలింగ్

    సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ నేత్రా కుమనన్ లేజర్ రేడియల్ రేస్ పోటీలో బరిలోకి దిగనుంది.

  • 25 Jul 2021 08:14 AM (IST)

    టెన్నిస్

    మహిళల డబుల్స్ మొదటి రౌండ్‌లో సానియా మీర్జా / అంకితా రైనా ఉక్రెయిన్‌కు చెందిన లియుడ్మిలా కిచెనోక్ / నాడియా కిచెనోక్‌తో తలపడుతున్నారు.

  • 25 Jul 2021 07:43 AM (IST)

    బ్యాడ్మింటన్ - పీవీ సింధు విజయం

    భారత మహిళా షట్లర్‌ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, ఒలింపిక్స్‌లో తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పోలికార్పోవాతో జరుగుతున్న సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 27-1, 20-10తో వరుస సెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్ కేవలం 29 నిమిషాల్లోనే ముగిసింది.

  • 25 Jul 2021 07:36 AM (IST)

    బ్యాడ్మింటన్ - పీవీ సింధు పోరాటం

    గ్రూప్ జేలో తన మొదటి మ్యాచ్‌లో పీవీ సింధు ఇజ్రాయెల్ క్రీడాకారిణితో తలపడుతోంది. సింధు ఈసారి పతకం సాధించాలనే పట్టుదలగా బరిలోకి దిగింది

  • 25 Jul 2021 07:14 AM (IST)

    రోయింగ్ - సెమీ ఫైనల్స్‌లో అరుణ్ లాల్, అరవింద్

    మూడవ రోజు ఎయిర్ ఫిస్టల్‌లో ఫలితాలు భారత్‌కు అనుకూలంగా రాలేదు. కానీ, రోయింగ్‌లో మాత్రం శుభవార్త అందింది. అరవింద్ సింగ్, అరుణ్ లాల్ రోయింగ్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించారు.

  • 25 Jul 2021 07:05 AM (IST)

    ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన మను, దేస్వాల్

    మను బాకర్, దేస్వాల్ ఇద్దరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. మను బాకర్ 575 పాయింట్లతో 12 వ స్థానంలో, దేస్వాల్ 574 పాయింట్లతో 13 వ స్థానంలో నిలిచారు.

    మను బాకర్ - 98,95,94,95,98 యశస్విని దేస్వాల్ - 95,98,94, 97, 96,95

  • 25 Jul 2021 06:14 AM (IST)

    10 మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫైయింగ్ రౌండ్ నియమాలు

    10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫైయింగ్ రౌండ్లో ప్రతీ షూటర్ 10 మీటర్ల దూరం నుంచి ఆరు సిరీస్‌లలో గురిపెట్టాలి. ప్రతి సిరీస్‌లో 10 షాట్లు ఉంటాయి. అత్యధిక పాయింట్లు సాధించిన ఎనిమిది మంది ఆటగాళ్లు ఫైనల్‌ చేరుకుంటారు. మిగిలిన ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది.

Published On - Jul 25,2021 6:18 PM

Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు