Tokyo Olympics 2021: ఓ వైపు ఆస్ట్రేలియా చేతిలో భారీతేడాతో భారత హాకీ జట్టు ఓటమి.. మరోవైపు తొలిరౌండ్‌లోనే ఓడిన బాక్సర్ మనీష్

Tokyo Olympics 2021: టోక్యో ఒలంపిక్స్ లో భారత మెన్ హాకీ జట్టు.. చేజేతులారా ఓటమి కొనితెచ్చుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోటీలో భారత హాకీ జట్టు ఓటమిపాలైంది...

Tokyo Olympics 2021: ఓ వైపు ఆస్ట్రేలియా చేతిలో భారీతేడాతో భారత హాకీ జట్టు ఓటమి.. మరోవైపు తొలిరౌండ్‌లోనే ఓడిన బాక్సర్ మనీష్
Olympics
Follow us
Surya Kala

|

Updated on: Jul 25, 2021 | 6:15 PM

Tokyo Olympics 2021: టోక్యో ఒలంపిక్స్ లో భారత మెన్ హాకీ జట్టు.. చేజేతులారా ఓటమి కొనితెచ్చుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోటీలో భారత హాకీ జట్టు ఓటమిపాలైంది. పెనాల్టీ కార్నర్ రూపంలో అవకాశాలు వచ్చినా భారత క్రీడాకారులు అవి గోల్స్ కింద మలచడంలో విఫలమై భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఏడు గోల్స్ చేయగా.. భారత తరపున ఏకైక గోల్ ను దిల్ ప్రీత్ సింగ్ చేశాడు.

మొదటి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారీ పరాజయం పొందింది. నిజానికి భారత జట్టుకు గోల్స్ చేసే పలు అవకాశాలు పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చాయి. ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకి గోల్ చేసే అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో టీమిండియా ఆలస్యం చేసింది. తర్వాత అది గోల్ గా మలచినా లెక్కలోకి రాలేదు. అనంతరం ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుంది. భారత్ పై అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ.. ఆట మొదలైన 10 నిమిషాల్లోనే మొదటి గోల్ చేసింది. మొదటి క్యార్థర్ ముసిగేసమయానికి ఆస్ట్రేలియా 21వ, 23వ, 26వ నిమిషాల్లో గోల్స్ చేసి 4-0 తేడాతో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.

మూడో క్వార్టర్‌లో భారత జట్టు తరుపున దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కడే, ఆట 34వ నిమిషంలో ఏకైక గోల్చేశాడు. మూడో క్వార్ట్రర్ లో ఆస్ట్రేలియా రెండు గోల్స్ , నాలుగో క్వార్ట్రర్ లో మరో గోల్ చేసి 7-1 తేడాతో భారత పై భారీ తేడా తో ఆస్ట్రేలియా విజయబావుటా ఎగరవేసింది.

మరోవైపు భారీ అంచనాలతో టోక్యో ఒలంపిక్స్ లో అడుగు పెట్టిన బాక్సర్ మనీష్ కౌశిక్ ఓటమిపాలయ్యారు. 63 కేజీల విభాగంలో తొలిరౌండ్ లోనే ఓటమిపాలయ్యాడు. 63 కేజీల విభాగంలో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన లూక్ మెక్‌కార్మక్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో మనీష్ కౌశిక్ పరాజయం పొందాడు. నిజానికి మనీష్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Children-Social Media: పలు అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు.. భారత్‌లో సోషల్ మీడియాకు బానిసగా మారుతున్న 10ఏళ్ల లోపు పిల్లలు