Tokyo Olympics 2021: రాయిటర్స్‌పై చైనా ఆగ్రహం.. మహిళా అథ్లెట్ ఫొటో అభ్యంతరకరంగా చూపిస్తారా అంటూ..!
చైనాకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ హౌ జిహుయి టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. అయితే ఆమె ఫొటోను రాయిటర్స్ భయంకరంగా చూపించిందంటూ చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగ్గులేకుండా ఇలా ఎలా ప్రచురిస్తారని విమర్శించింది.
China vs Reuters: జపాన్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో చైనా వెయిట్ లిఫ్టర్ హౌ జిహుయి బంగారు పతకం సాధించింంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, రాయిటర్స్ ప్రచురించిన ఓ ఫొటోపై చైనా విమర్శలు గుప్పించింది. బ్రిటన్ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ ఫొటోను విడుదల చేసింది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘లౌసీ పిక్చర్’ అని పిలుస్తూ.. విమర్శలు గుప్పించింది. రాజకీయాలను ఆటలోకి లాగవద్దంటూ రాయిటర్స్‌కు సూచించింది. ఈ మేరకు చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో వెయిట్ లిఫ్టర్ ఫొటోను కూడా పంచుకుంది.
గ్లోబల్ టైమ్స్ తన ట్వీట్‌లో ‘రాయిటర్స్.. దయచేసి ఒలింపిక్స్ స్ఫూర్తిని గౌరవించండి. వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలిచిన హౌ జిహుయి ఫొటో అసభ్యకరంగా ప్రచురించారని’ శ్రీలంకలోని చైనా రాయబార కార్యాలయం విమర్శించింది. ‘రాజకీయాలను ఆటలకు ముడి పెట్టవద్దని సూచించింది. సిగ్గులేనిదిగా ప్రవర్తించింది’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది. చైనా ప్లేయర్ హౌ జిహుయి, భారత మహిళా అథ్లెట్ మీరాబాయి చానుతో తుది మ్యాచ్లో పోటీపడ్డారు. ఇందులో జిహుయి బంగారు పతకం, చాను రజత పతకం సాధించారు. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి మొత్తం 202 కిలోలు ఎత్తింది. చైనాకు చెందిన జిహుయి 210 కిలోలను ఎత్తి బంగారు పతకం సాధించింది. అలాగే ఇండోనేషియా క్రీడాకారిణి కెంటికా విండి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో చాను భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది.
పాశ్చాత్య దేశాలతో చైనా సంబంధాలు.. పాశ్చాత్య దేశాలతో చైనా సంబంధాలు చాలా ఉద్రిక్తతంగా మారుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా ఏ దేశంతోనూ సఖ్యత లేదు. జీ 7 దేశాల సమావేశం తరువాత, చైనా (చైనా జీ 7 కంట్రీస్ కార్టూన్) ఒక కార్టూన్‌ను విడుదల చేసింది. ఇందులో పాల్గొన్న దేశాధినేతలందరినీ జంతువుల కార్టూన్‌లుగా చూపించారు. ఆయా దేశాల జెండాలతో టోపీలు ధరించినట్లుగా ఫొటోలు విడుదల చేశారు. ఇలాంటివి ప్రతిరోజూ విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిపై ఇతర దేశాలు మాత్రం మౌనంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేద. కానీ, చైనా మాత్రం అథ్లెట్ ఫొటోపై బ్రిటన్ న్యూస్ ఏజెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం.
Pls respect Olympics spirit @Reuters! Chinese embassy @ChinaEmbSL slammed Reuters’ selection of an ugly photo of weightlifting gold winner Hou Zhihui. “Don’t put politics and ideologies above sports, and call yourself an unbiased media organization. Shameless,” the embassy posted pic.twitter.com/lIOWLOhdfj
— Global Times (@globaltimesnews) July 25, 2021
Also Read:
Tokyo Olympics 2020: ఆండీ ముర్రే ఔట్.. సింగిల్స్ నుంచి వైదొలిగిన బ్రిటన్ స్టార్ ప్లేయర్