Tokyo Olympics 2020: బాక్సింగ్‌లో మేరీ కోమ్ శుభారంభం.. ఫ్లై వెయిట్ రౌండ్ 32లో విజయం
టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్ స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ విజయంతో తన ఖాతా తెరిచారు. మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 32లో డొమినికన్ రిపబ్లిక్ మహిళా బాక్సర్‌ను ఓడిచింది.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్ స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ విజయంతో తన ఖాతా తెరిచారు. మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 32లో డొమినికన్ రిపబ్లిక్ మహిళా బాక్సర్‌ను ఓడిచింది. మేరీ కోమ్ పంచ్‌లతో మరోసారి ఆకట్టుకుంది. అలాగే పతకంపై ఆశలు సజీవంగా ఉంచింది. ఈ మ్యాచ్‌లో 4-1తో మేరీకోమ్ విజయం సాధించింది. దీంతో మేరీ కోమ్ రౌండ్ 16కు అర్హత సాధించింది.
ఆదివారం జరిగిన తన మొదటి మ్యాచ్‌లో పలు వ్యూహాలతో బరిలోకి దిగిన మేరీకోమ్.. మ్యాచ్‌లో తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. మొదటి రెండు రౌండ్లను గెలిచిన మేరీకోమ్.. మూడవ రౌండ్లో కాస్త వెనక్కి తగ్గారు. అనంతరం బలంగా పంచ్‌లు విసిరి ప్రత్యర్థిపై దాడి చేసి విజయం సాధించింది. జులై 29న మేరీ కోమ్ కొలంబియాకు చెందిన మూడో సీడ్ వాలెన్సియా విక్టోరియాతో రౌండ్ 16లో తలపడనుంది. మేరీకోమ్ 2012 లండన్ ఒలింపిక్స్ విభాగంలో క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి పతకం సాధించేందుకు బరిలోకి దిగిన మేరీకోమ్.. మొదటి మ్యాచులో ఆకట్టుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీకోమ్… ఆమేరకు అంచనాలను అందుకోవడంలో సఫలమైంది.
Also Read: