IND Vs SL, 1st T20 Preview: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా.. మిస్టరీ స్పిన్నర్‌కు అవకాశం? ఆత్మవిశ్వాసంతో శ్రీలంక.. నేటినుంచే టీ20 పోరు

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా.. నేటినుంచి మొదలుకానున్న మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. పొట్టి క్రికెట్‌లో ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

IND Vs SL, 1st T20 Preview: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా.. మిస్టరీ స్పిన్నర్‌కు అవకాశం? ఆత్మవిశ్వాసంతో శ్రీలంక.. నేటినుంచే టీ20 పోరు
Ind Vs Sl T20 Series
Follow us

|

Updated on: Jul 25, 2021 | 1:01 PM

IND Vs SL, 1st T20 Preview: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా.. నేటినుంచి మొదలుకానున్న మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. పొట్టి క్రికెట్‌లో ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం) తొలి టీ20 జరగనుంది. కాగా, చివరి వన్డేలో భారత్‌పై నెగ్గిన శ్రీలంక ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

మిడిల్ ఆర్డర్, బౌలింగ్‌లో మార్పులు టీ 20 సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్, బౌలింగ్ లైనప్‌లో మార్పులు కనిపించేలా ఉన్నాయి. ఓపెనింగ్ బాధ్యత కెప్టెన్ శిఖర్ ధావన్, పృథ్వీ షా భుజాలపైనే ఉండనుంది. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగనున్నారు. మనీష్ పాండే స్థానంలో సంజు శాంసన్ ఆడే అవకాశం ఉంది.

చాహల్ భాగస్వామిలో మార్పు బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు బదులుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం రావడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి స్పిన్‌లో చాహల్ భాగస్వామిగా బరిలోకి దిగనున్నాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌‌లో సత్తాచాటి… యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌లో కనబరిచిన ఆటతీరుతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చాహర్ ఆడబోతున్నాడు. మొత్తంమీద బ్యాటింగ్‌లో రితురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్ అవకాశం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండనుంది.

చివరి వన్డే గెలుపుతో పెరిగిన లంక ఆత్మవిశ్వాసం… కెప్టెన్ దసున్‌ షనక నాయకత్వంలోని శ్రీలంక.. భారీ స్కోర్లే చేసినా.. బౌలింగ్‌లో తడబడడంతో మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయింది. ఇక చివరి వన్డేలో సమిష్టిగా రాణించి, లోపాలను సవరించుకుని విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అవిష్క ఫెర్నాండో సూపర్‌ ఫామ్‌, రాజపక్స ఆకట్టుకోవడంతో పొట్టి క్రికెట్‌లో సత్తా చాటాలని లంక టీం ఆశపడుతోంది.

పిచ్, వాతావరణం ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే టీ20 సిరీస్‌ కూడా జరగనుంది. పిచ్‌ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తొలి టీ20కి వర్షం అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఉరుములతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్లేయింగ్ లెవన్ (అంచనా) భారత్‌: ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్‌ చహర్, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్, వరుణ్‌ చక్రవర్తి, చహల్‌/రాహుల్‌ చహర్‌. శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, రాజపక్స, ధనంజయ డిసిల్వా, అసలంక, కరుణరత్నే, అకిల ధనంజయ, జయవిక్రమ, చమీర, రమేశ్‌ మెండిస్‌.

Also Read:

Viral Video: 43 బంతుల్లో 92 పరుగులు.. పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా ఉమెన్స్ ప్లేయర్.. ఇది బౌలర్లపై దండయాత్రే అంటూ నెటిజన్ల కామెంట్లు

Tokyo Olympics 2021: రాయిటర్స్‌పై చైనా ఆగ్రహం.. మహిళా అథ్లెట్ ఫొటో అభ్యంతరకరంగా చూపిస్తారా అంటూ..!