Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 43 బంతుల్లో 92 పరుగులు.. పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా ఉమెన్స్ ప్లేయర్.. ఇది బౌలర్లపై దండయాత్రే అంటూ నెటిజన్ల కామెంట్లు

టీమిండియా బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుతం సృష్టించింది. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్స్‌ ఉమెన్స్‌ కాంపిటీషన్‌‌లో భీభత్సంగా బౌలర్లపై విరుచుకపడింది. ఈ టోర్నీలో రోడ్రిగ్స్‌ నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌ తరపున ఆడుతోంది.

Viral Video: 43 బంతుల్లో 92 పరుగులు.. పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా ఉమెన్స్ ప్లేయర్.. ఇది బౌలర్లపై దండయాత్రే అంటూ నెటిజన్ల కామెంట్లు
Jemimah Rodrigues 92 Runs In 43 Balls In100 Balls Tourney
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2021 | 12:31 PM

Viral Video: టీమిండియా బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుతం సృష్టించింది. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్స్‌ ఉమెన్స్‌ కాంపిటీషన్‌‌లో  బౌలర్లపై విరుచుకపడింది. ఈ టోర్నీలో రోడ్రిగ్స్‌ నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌ తరపున ఆడుతోంది. వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచులో కేవలం 43 బంతుల్లోనే 92 పరుగులు బాదింది. ఇందులో 17 ఫోర్లు, 1 సిక్సర్‌ ఉన్నాయి. రోడ్రిగ్స్ దెబ్బకు మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్ ఫైర్ టీం 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ టీం తరపున హెలీ మాథ్యూస్‌ 30 పరుగులతో హై స్కోర్‌ చేసింది. నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌ బౌలర్లలో స్మిత్‌ 3, కేతి లెవిక్‌, అలిస్‌ రిచర్డ్స్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

131 పరుగులతో బ్యాటింగ్‌కు దిగిన నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌కు ఆదిలోనే వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. కెప్టెన్‌ లారెన్‌ విన్‌ఫిల్డ్‌ డకౌట్‌ కగా అనంతరం 19 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో జెమిమా రోడ్రిగ్స్ బౌలర్లపై విరుచుకపడుతూ బౌండరీల సునామీ సృష్టించింది. 43 బంతుల్లో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అలాగే జట్టుకు విజయాన్ని అందించింది. నార్తన్ సూరర్ చార్జర్స్ తరపున బెస్‌ హెత్‌ 12, అలిస్‌ రిచర్డ్స్‌ 23 పరుగులతో నిలిచారు. కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది. జేమీ రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు చూస్తున్నారు.

Also Read:

Mahendra Singh Dhoni : మహేంద్ర సింగ్ ధోని కోచ్‌గా రెండో ఇన్నింగ్స్..! ఆసక్తికర కామెంట్ చేసిన పాకిస్తాన్ క్రికెటర్..

37 ఫోర్లు, 10 సిక్సర్లు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. హై-వోల్టేజ్ వన్డే మ్యాచ్!