AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

37 ఫోర్లు, 10 సిక్సర్లు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. హై-వోల్టేజ్ వన్డే మ్యాచ్!

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు స్కోర్‌లు సర్వసాధారణం. ముఖ్యంగా బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా.. బ్యాట్స్‌మెన్లు విరుచుకుపడిపోతే...

37 ఫోర్లు, 10 సిక్సర్లు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. హై-వోల్టేజ్ వన్డే మ్యాచ్!
Royal London Cup
Ravi Kiran
|

Updated on: Jul 24, 2021 | 1:20 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు స్కోర్‌లు సర్వసాధారణం. ముఖ్యంగా బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా.. బ్యాట్స్‌మెన్లు విరుచుకుపడిపోతే.. ఆ మజానే వేరుంటుంది. ఇలాంటివి చేయడంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ముందుంటారు. తాజాగా జరిగిన అలాంటి ఓ హై-వోల్టేజ్ మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌లో రాయల్ లండన్ కప్ టోర్నమెంట్‌లో జరిగింది. కౌంటీ ఛాంపియన్‌షిప్.. ఆ తర్వాత టీ20 బ్లాస్ట్.. ఇప్పుడు రాయల్ లండన్ వన్డే కప్.. ఈ టోర్నీలో జూలై 22వ తేదీన జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కలిగించింది.

కెంట్, దుర్హమ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో కెంట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన దుర్హమ్ నిర్ణీత ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 405 పరుగులు చేసింది. దుర్హమ్ కౌంటీ చరిత్రలో ఈ జట్టు వన్డేలో 400 కంటే ఎక్కువ స్కోరు సాధించడం ఇదే మొదటిసారి. ప్రత్యర్ధి బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపలేదు. దుర్హమ్ బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.

ఓపెనర్లు సెంచరీలు.. మిడిల్ ఆర్డర్‌లో రెండు అర్ధ శతకాలు..

దుర్హమ్ జట్టు ఓపెనర్లు పెను విధ్వంసం సృష్టించారని చెప్పాలి. ముఖ్యంగా క్లార్క్(141) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ లీస్(100)తో కలిసి 34 ఓవర్లలో 242 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్లార్క్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ బెడింగ్‌హామ్(67), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(60) ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ వాయువేగంతో అర్ధ శతకాలను పూర్తి చేశారు. దీనితో దుర్హమ్ భారీ స్కోర్ చేయగలిగింది. కెంట్ బౌలర్లలో క్విన్ ఏకంగా 10 ఓవర్లలో 97 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, ఈ భారీ లక్ష్యాన్ని చేధించడంలో కెంట్ విఫలమైంది. 50 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 302 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు