Viral Pic: జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ప్రతీ రోజూ ఏదొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అవి నెటిజన్లకు పరీక్ష పెడతాయి. అసలు అందులో ఏముంది.? ఉంటే ఎక్కడ..

Viral Pic: జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!
Tiger
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2021 | 12:10 PM

ప్రతీ రోజూ ఏదొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అవి నెటిజన్లకు పరీక్ష పెడతాయి. అసలు అందులో ఏముంది.? ఉంటే ఎక్కడ దాగి ఉందని.. కనిపెట్టడంలో జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పిక్చర్ పజిల్స్ వారికి ప్రతీసారి థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తాయి. ఇక పైన పేర్కొన్న ఫోటోలో ఓ పెద్దపులి దాగి ఉంది. నెటిజన్లు దానిని కనిపెట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓసారి మీరు కూడా లుక్కేయండి.!

ఈ ఫోటోలో పులిని కనిపెట్టడం కొంచెం కష్టమే. ఆ పెద్దపులి.. దూరం నుంచి జింకల మందను చూసింది.. వేటాడేందుకు ఎక్కడో నక్కింది. అయితే ఆ పులి రాకను పసిగట్టిన ఈ జింకలు భయంతో పరుగుపెడుతున్నాయి. వీటిల్లో ఆ పెద్దపులిని కనిపెట్టడం కష్టతరం. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ వరుణ్ తక్కర్ అత్యంత పకడ్బందీగా ఈ ఫోటోను తీశారు. దీనిని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆ పజిల్‌ను క్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా అందరూ ఈ పజిల్‌లో సక్సెస్ కూడా అయ్యారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఫోటోపై లుక్కేయండి.

కాగా, ఈ వైరల్ పిక్ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోం సమయాల్లో ప్రజలు.. ఈ టైప్ పజిల్స్ సాల్వ్ చేస్తూ తమ ఖాళీ టైంను గడుపుతున్నారని చెప్పాలి.

Also Read:

పార్లమెంట్‌ సభలో ఊహించని సంఘటన.. నేతలు పరుగో పరుగు.. వైరల్ వీడియో.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!

40 ఏళ్ల భారత బౌలర్ దుమ్ములేపాడు.. 10 పరుగులకు 5 వికెట్లు తీసి విధ్వంసం సృష్టించాడు..

ఈ కొండపై చిరుత ఇంచక్కా సేద తీరుతోంది.. అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం.!

మహిళ బయటికి వెళ్లగానే.. ప్లాట్‌లోకి చొరబడుతున్న యజమాని.. చివరికి ఏం జరిగిందంటే!