40 ఏళ్ల భారత బౌలర్ దుమ్ములేపాడు.. 10 పరుగులకు 5 వికెట్లు తీసి విధ్వంసం సృష్టించాడు..

భారత్‌లో టాలెంట్‌కు కొదవలేదు.. ఏ రంగమైనా కూడా ఎంతోమంది అదరగొట్టే వ్యక్తులు ఉన్నారు. ఇక క్రికెట్ విషయానికి వస్తే.. దేశవాళీ టోర్నీల్లో..

  • Publish Date - 1:22 pm, Thu, 22 July 21
40 ఏళ్ల భారత బౌలర్ దుమ్ములేపాడు.. 10 పరుగులకు 5 వికెట్లు తీసి విధ్వంసం సృష్టించాడు..
Satish

భారత్‌లో టాలెంట్‌కు కొదవలేదు.. ఏ రంగమైనా కూడా ఎంతోమంది అదరగొట్టే వ్యక్తులు ఉన్నారు. ఇక క్రికెట్ విషయానికి వస్తే.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టే ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఓ ప్లేయర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇతడి వయస్సు 40 ఏళ్లు.. కానీ ఇప్పటికీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో జూలై 20న తిరుప్పూర్ తమిజాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, 40 ఏళ్ల రాజగోపాల్ సతీష్ మాయాజాలం చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీనితో తిరుప్పూర్ జట్టు 62 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ సూపర్ గిల్లీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అని నిరూపిస్తూ రాజగోపాల్ సతీష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఓవర్‌లో ఒక వికెట్, రెండో ఓవర్ మరొకటి, ఇక థర్డ్ ఓవర్‌లో రెండు వికెట్లు, లాస్ట్ ఓవర్ ఒక వికెట్ వెరిసి.. తన కోటాలో నాలుగు ఓవర్లు వేసిన సతీష్.. 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఐపీఎల్‌లో కూడా రాజగోపాల్ సతీష్ తన సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!