AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Dravid: కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో యంగ్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ..

శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ కుర్రాళ్లను అభినందించారు.

Rahul Dravid: కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో యంగ్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ..
Rahul Dravid Speech With Team Inda Boys
Venkata Chari
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 22, 2021 | 2:28 PM

Share

IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ కుర్రాళ్లను అభినందించారు. విజేతలా ఆడిందని, ఒకవేళ ఓటమి పాలైనా ఆటతీరు బాగానే ఉందని అంటానని పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో ఆయన మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా పోరాడి గెలిచింది. ఈ సందర్భంలోనే యువ ఆటగాళ్లను ప్రసంశిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో ద్రవిడ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. ‘తొలి వన్డేలో ఓటమితో శ్రీలంక టీం ధీటుగా బదులిస్తుందని ఊహించామని, ఆ మేరకు రెండవ వన్డేలో భారీ స్కోర్ చేశారు. మేం మంచి ఫలిలాన్ని సాధించాం. కుర్రాళ్లు చాలా బాగా ఆడారు. ఒకవేళ టీమిండియా ఓడిపోయినా మా పోరాటం గొప్పగానే ఉందని అంటానని, అందరికీ అభినందనలు’ అంటూ టీమిండియా కుర్రాళ్లతో మాట్లాడారు. ‘శ్రీలంక ధీటుగా బదులిస్తుందని ముందే ఊహించాం. ప్రత్యర్థిని కూడా గౌరవించాలని కుర్రాళ్లతో చెప్పాం. శ్రీలంకది కూడా ఇంటర్నేషనల్ జట్టే. ఆ స్థాయిలోనే వారు రెండో వన్డేలో భారీ స్కోర్ చేశారు. దానికి మా కురాళ్ల విజేత జట్టులా బదులిచారని’ అని ద్రవిడ్‌ తెలిపాడు.

‘ఇలాంటి సమయంలో వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం మంచిది కాదు. కొందరు త్వరగా పెవలియన్ చేరారు. మరికొందరు చివరి వరకు పోరాడారు. మేం దాని గురించి ఆటగాళ్లతో మాట్లాడాము. అందరి ఆటగాళ్ల భాగస్వామ్యాన్ని గుర్తించి ప్రశంసిస్తాం. టోటల్‌గా టీమిండియా ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో కలిసి పోరాడి, విజయం సాధించారని’ ద్రవిడ్ తెలిపారు. భువి, దీపక్‌ చాహర్‌, సూర్యకుమార్‌ సైతం మాట్లాడుతూ.. ‘ఇది మర్చిపోలేని విజయం, గొప్ప మ్యాచుల్లో భాగస్వామ్యం కావాలని భావించాం. అలాగే రోజూ బ్యాటింగ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఈ రోజు అది సాధ్యమైందపి’ వారు పేర్కొన్నారు.

రెండవ వన్డేలో బాల్‌తోనే కాక, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు దీపక్ చాహర్. రెండు వికెట్లతోపాటు 82 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే ఎనిమిదవ వికెట్‌కు భువనేశ్వర్‌తో కలిసి 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. దీంతో భారత్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read:

బికినీలకు బదులు షార్ట్‌లు వేసుకుంటారా.. అయితే ఫైన్ కట్టండి.. నార్వే జట్టుకు షాకిచ్చిన యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్

Happy Birthday Trent Boult: భయంకరమైన బంతులతో చెలరేగిన కివీస్ బౌలర్.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లకు పగలే చుక్కలు..!