Happy Birthday Trent Boult: భయంకరమైన బంతులతో చెలరేగిన కివీస్ బౌలర్.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లకు పగలే చుక్కలు..!
న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.
Happy Birthday Trent Boult: క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అతి భయంకరమైన బంతులను సంధిస్తూ బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. ఇలాంటి వాళ్లలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఒకడు. తనదైన రోజున మైదానంలో చెలరేగిపోయి ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతుంటాడు. షేన్ బాండ్ తరువాత అదే రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాడు ఈ కివీస్ సీనీయర బౌలర్. న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. అన్ని ఫార్మాట్‌లో టీంకు వెన్నుముకగా నిలిచాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన ఈ పేసర్.. భయంకరమైన ఫాస్ట్ బౌలింగ్‌తో విజయవంతమయ్యాడు. నేడు(22 జులై) ట్రెండ్ బౌల్డ్ పుట్టిన రోజు. ఈ న్యూజిలాండ్ పేసర్ కెరీర్‌లో ఎన్నో అద్భుత మ్యాచులున్నాయి. 2015 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై తన విశ్వరూపాన్ని చూపించిన మ్యాచ్, తన కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిపోతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు పగలే చుక్కలు చూపించి పెవిలియన్ చేర్చి, కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే… 2015 ప్రపంచ కప్‌లో భాగంగా ఒకే గ్రూపులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం ట్రెంట్ బౌల్డ్ ధాటికి కేవలం 151 పరుగులకే చాప చుట్టేసింది. అతి భయంకరమైన బంతులు విసిరిన ఈ కివీస్ పేసర్.. కేవలం మూడు ఓవర్లలో 5గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. మిచెల్ క్లార్క్ (12), మాక్స్ వెల్ (1), మిచెల్ మార్ష్ (0), మిచెల్ జాన్షన్ (1), మిచెల్ స్టార్క్ (0) లాంటి దిగ్గజాలను అతి తక్కువ పరుగులకే ఔట్ చేసి, ఆస్ట్రేలియా టీం తక్కువ స్కోర్‌కే కట్టడి చేసేందుకు తనవంతు సహాయం చేశాడు. ఈ మ్యాచులో మొత్తం పది ఓవర్లు వేసిన ట్రెండ్ బౌల్డ్ మూడు మెయిడిన్లు వేసి, కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అనంతరం కివీస్ 23.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తిచేసింది. అయితే, ఇదే ప్రపంచ కప్‌లో ఫైనల్‌లో మరోసారి తలపడ్డాయి. ఈసారి మాత్రం ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడి 292 వికెట్లు సాధించాడు. అలాగే 93 వన్డేల్లో 169 వికెట్లు పడగొట్టాడు. ఇక 34 టీ20లు ఆడి 46 వికెట్లు తీశాడు.
Five wickets in three overs! ?️
On his birthday, enjoy @BLACKCAPS star Trent Boult’s @cricketworldcup masterclass against Australia! pic.twitter.com/jxV4AlmOHG
— ICC (@ICC) July 22, 2021
Also Read:
ICC Rankings: ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ
Tokyo Olympics 2021: బిజిబిజీగా భారత క్రీడాకారులు.. ప్రాక్టీస్‌లో లీనమైన అథ్లెట్లు.. పతకాలపై కన్ను!