Tokyo Olympics 2021: నెదర్లాండ్స్ సరికొత్త రికార్డ్.. అమెరికాకు తొలిదెబ్బ.. ప్రారంభోత్సవానికి ముందే ఫుట్‌బాల్ లీగ్ మ్యాచులు షురూ..!

ఒలింపిక్స్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందే మహిళల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. కాగా, బుధవారం నుంచి మొదటి రౌండ్‌ లీగ్ మ్యాచులు జరుగుతున్నాయి.

Tokyo Olympics 2021: నెదర్లాండ్స్ సరికొత్త రికార్డ్.. అమెరికాకు తొలిదెబ్బ.. ప్రారంభోత్సవానికి ముందే ఫుట్‌బాల్ లీగ్ మ్యాచులు షురూ..!
Olympics 2032 Football Leagues
Follow us
Venkata Chari

|

Updated on: Jul 22, 2021 | 9:05 AM

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ గేమ్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం జరగనున్న ప్రారంభ వేడుకల అనంతరం ఈ పోటీలు మొదలుకానున్నాయి. అయితే ఫుట్‌బాల్ పోటీలు మాత్రం రెండు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభమైన ఫుట్‌బాల్ పోటీల్లో పలు రికార్డులు నమోదయ్యాయి. నాలుగుసార్లు ఒలింపిక్‌లో బంగారు పతకాన్ని సాధించి విజేతగా నిలిచిన అమెరికా మహిళల ఫుట్‌బాల్‌ టీంకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం ఎదురైంది. పతకం కోసం ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అమెరికాకు స్వీడన్‌ షాక్‌ ఇచ్చింది. గ్రూపు జిలో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికాను 0–3 గోల్స్‌ తేడాతో స్వీడన్‌ ఓడించింది. అమెరికా టీం గత 44 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోలేదు. కానీ, టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన తొలిరోజే ఓటమిని అందుకోవడం ఒకింత షాక్‌కు గురైంది. ఈమ్యాచులో బ్లాక్‌స్టెనియస్‌ 25వ, 54వ నిమిషాల్లో రెండు గోల్స్‌ చేసింది. మూడో గోల్‌ను లినా హర్టిగ్‌ 72వ నిమిషంలో చేసింది. దీంతో అమెరికాకు పరాభవం తప్పలేదు. ఇదే గ్రూపులో జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–1 తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

గ్రూప్‌ ‘ఇ’లో జరిగిన పోరులో బ్రిటన్‌ 2–0 గోల్స్‌తో చిలీపై విజయం సాధించింది. ఇదే గ్రూపులో జరిగిన జపాన్, కెనడా మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. మరో గ్రూప్‌ ‘ఎఫ్‌’లో జరిగిన పోరులో నెదర్లాండ్స్‌ 10–3తో జాంబియాపై, బ్రెజిల్‌ 5–0తో చైనాపై విజయం సాధించాయి. ఒలింపిక్స్‌ క్రీడలు అధికారికంగా శుక్రవారం ఆ ఆరంభమ వుతాయి. అయితే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను మాత్రం రెండు రోజుల ముందుగానే ప్రారంభిస్తారు. మరోవైపు మహిళల సాఫ్ట్‌బాల్‌ పోటీలు కూడా బుధవారమే మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ జట్టు 8–1తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. కాగా, మహిళల ఒలింపిక్ ఫుట్‌బాల్ మ్యాచులో ఒకే జట్టు అత్యధిక గోల్స్ చేసిన రికార్డును నెదర్లాండ్స్ నెలకొల్పింది. బుధవారం జరిగిన నెదర్లాండ్స్, జాంబియా మ్యాచ్‌లో అత్యధిక స్కోరింగ్ గేమ్‌గా నిలిచింది. ఈ మ్యాచులో నెదర్లాండ్స్ 10-3తో జాంబియాపై విజయం సాధించింది. ఇందులో బాంజియా కెప్టెన్ బార్బ్రాండా ఒలింపిక్స్‌లో వరుసగా మూడు గోల్స్ చేసిన మొట్టమొదటి ఆఫ్రికన్ క్రీడాకారిణిగా నిలిచారు.

రెండు రోజుల ముందే ఫుట్‌బాల్ పోటీలు.. ఒలింపిక్స్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందే మహిళల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. కాగా, బుధవారం నుంచి మొదటి రౌండ్‌ లీగ్ మ్యాచులు జరిగాయి. మొత్తం 12 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొత్తం మూడు గ్రూపులుగా ఇ, ఎఫ్, జీలు విభజించారు. ప్రతీ గ్రూపులో నాలుగు జట్లు ఉన్నాయి. అలాగే నేటినుంచి పురుషుల ఫుట్‌బాల్ పోటీలు మొదలుకానున్నాయి. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు టీంల చొప్పున నాలుగు గ్రూపులు ఏ, బీ, సీ, డీ గా విభజించారు. తొలి రౌండ్‌లో భాగంగా ప్రతి గ్రూప్‌లోని జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది.

Also Read:

Tokyo Olympics 2021: ప్రారంభోత్సవంలో 15 దేశాల నాయకులు.. ప్రతీ దేశం నుంచి 6 గురు.. విశ్వ క్రీడలకు రంగం సిద్ధం

Brisbane Olympics 2032: బ్రిస్బేన్‌లోనే 2032 ఒలింపిక్ గేమ్స్.. ప్రకటించిన ఐఓసీ

Tokyo Olympics 2021: దారులన్నీ అటువైపే.. కసితో పడుతున్న అడుగులు.. పతకాల కోసం పరుగులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!