- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo olympics 2021 indian athlets full busy in practice
Tokyo Olympics 2021: బిజిబిజీగా భారత క్రీడాకారులు.. ప్రాక్టీస్‌లో లీనమైన అథ్లెట్లు.. పతకాలపై కన్ను!
భారతదేశం నుంచి తొలివిడతగా కొంతమంది క్రీడాకారులు జులై 18 న టోక్యో వెళ్లిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచేందుకు తెగ కష్టపడుతున్నారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.
Updated on: Jul 22, 2021 | 9:28 AM

రేపటి నుంచి విశ్వ క్రీడా సంబురం మొదలుకానుంది. కాగా తొలివిడతగా అక్కడికి చేరుకున్న భారత్ క్రీడాకారులు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. తొలి రోజే భారత అథ్లెట్లు పలు విభాగాల్లో బరిలోకి దిగనున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొన్న ఏకైక ఖడ్గవీరుడు భవానీ దేవి బుధవారం ప్రాక్టీస్ ప్రారంభించింది. ప్రాక్టీస్2లో భాగంగా ఆమె ముఖానికి ధరించిన భారత జెండాతో ఉన్న ఆమె హెడ్ గేర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఒలింపిక్స్‌కు ముందు భారత బాక్సింగ్ జట్టు క్రీడా గ్రామంలో సరదగా గడిపారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్‌తో సహా, బాక్సింగ్ బృందానికి చెందిన పలువురు ఆటగాళ్ళు క్రీడా గ్రామంలో విశ్రాంతి తీసుకున్నారు. బాక్సింగ్ ఈవెంట్ జరిగే వేదిక స్పోర్ట్స్ గ్రామానికి దూరంగా ఉన్నందున ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు.

మొదటిసారి, ముగ్గురు ఆటగాళ్ళు దేశం తరపున స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ ప్రారంభించారు. శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాష్ నేరుగా అర్హత సాధించగా, మనా పటేల్‌కు ర్యాంకుల ఆధారంగా స్థానం లభించింది.

భారతదేశానికి ఒలింపిక్స్‌లో పతకం తెచ్చే బలమైన పోటీదారుడిగా బజరంగ్ పునియా కూడా సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. కొంతకాలం క్రితం శిక్షణలో గాయపడిన బజరంగ్.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.

భారత ఆర్చరీ బృందం కూడా స్పోర్ట్స్ గ్రామానికి చేరుకున్న తరువాత ప్రాక్టీస్ ప్రారంభించింది. ఆటగాళ్లు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు.





























