AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Prices: సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్.. దేశంలో పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు..

దేశ ప్రజలకు మరో షాక్ తగిలింది. యుద్దం కారణంగా వాటర్ బాటల్ ధరలు పెరిగాయి. ఎండ తీవ్రత క్రమంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో ధరలు పెరగడం బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ధరలు ఎంత పెరిగాయో ఈ స్టోరీలో చూద్దాం.

Water Prices: సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్.. దేశంలో పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు..
Water Bottle Price Hike India
Venkatrao Lella
|

Updated on: Mar 21, 2026 | 12:29 PM

Share

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో దేశంలో ఇప్పటికే గ్యాస్, ఇంధన, వంటనూనె ధరలు పెరగ్గా.. తాజాగా మరో షాక్ కూడా తగలింది. అంతర్జాతీయ ఉద్రిత్త పరిస్థితుల క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దీని ప్రభావం నిత్యావసర ధరలపై పడుతోంది. తాజాగా మరో నిత్యావసర వస్తువు ధర పెరిగింది. అదే ప్లాస్టిక్ వాటర్ బాటిల్. ప్లాస్టిక్ బాటిళ్లకు వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలో వాటర్ బాటిళ్ల ధరలను 8 శాతం నుంచి 11 శాతం వరకు కంపెనీలు పెంచాయి. బిస్లరీతో పాటు మిగతా కంపెనీలన్నీ ధరలను గణనీయంగా పెంచేశాయి.

పెరిగిన మూత ఖర్చులు

ప్రస్తుతం 12 బాటిళ్లు ఉంటే బిస్లరీ 1 లీటర్ ప్యాక్ ధర రూ.216 నుంచి రూ.240కి పెరిగింది. ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు, ఖర్చులు పెరగడం వల్ల పెంచక తప్పడం లేదని కంపెనీ తెలిపింది. ప్లాస్లిట్ బాటర్ బాటిల్ కోసం ఉపయోగించే పాలిమర్ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ నుంచి పాలిమార్ తయారుచేస్తారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాలిమార్ ధరలు కూడా పెరగడంతో వాటర్ బాటిల్ కంపెనీలపై భారం పెరిగింది. ఇక మూతలు, కార్టన్ పెట్టెలు, లేబుళ్లు, టేప్ వంటి ఇతర ధరలు కూడా పెరిగాయి. ప్లాస్టిక్ పదార్థాల ధర 50 శాతం పెరగడంతో కిలోగ్రాముకు రూ.170కి చేరుకుంది. ఇక మూతల ధర రెండింతలు పెరిగింది. దీని వల్ల వాటర్ బాటిల్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరగడంతో ధరలను పెంచేశారు.

జీఎస్టీ ప్రయోజనం నామమాత్రమే

సెప్టెంబర్‌లో వాటర్ బాటిళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో వీటి ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ ఖరీదుగా మారాయి. పార్లే ఆగ్రో, క్లియర్ వంటి ప్రీమియం బ్రాండ్ల వాటర్ బాటిల్ ధరలు కూడా 8 నుంచి 11 శాతం వరకు పెరిగాయి. ఇండియాలో మంచి నీరు దొరకడం అనేది కష్టంగా మారింది. భూగర్భ జలాలు 70 శాతం కలుషితమయ్యాయి. దీంతో 140 కోట్ల జనాభాకు తాగునీరు అందించడం అనేది కష్టంతో కూడుకున్న పని. దీంతో వాటర్ బాటిళ్లపై చాలామంది ఆధారపడుతున్నారు. పెరుగుతున్న ముడి పదార్థాల ధరల వల్ల వాటర్ బాటిళ్ల పరిశ్రమ మొత్తం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. యుద్దం పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇదే జరిగే సామాన్యులకు పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. అసలే ఎండాకాలం కావడంతో వీటిపై ఎక్కువమంది ఆధారపడతారు. బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.

Follow Us
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. వాటర్ బాటిల్ ధరలు మరింత ప్రియం
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. వాటర్ బాటిల్ ధరలు మరింత ప్రియం
దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి
దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
రోడ్డు పక్కన పొలం నుంచి అదే పనిగా శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
రోడ్డు పక్కన పొలం నుంచి అదే పనిగా శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..