ICC Rankings: ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో విరాటో కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ర్యాకింగ్స్‌లో ఎటువంటి మార్పు లేదు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన ఫలితాల్లో టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ 848 పాయింట్లో 2వ స్థానంలో నిలిచాడు.
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో విరాటో కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ర్యాకింగ్స్‌లో ఎటువంటి మార్పు లేదు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన ఫలితాల్లో టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ 848 పాయింట్లో 2వ స్థానంలో నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ 817 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత శ్రీలంక సిరీస్‌లో పాల్గొనకపోవడం వల్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరుసగా తొమ్మిది, ఎనిమిది రేటింగ్ పాయింట్లను కోల్పోయారు. అయితే, ర్యాకింగ్స్‌లో మాత్రం మార్పు లేకపోవడం విశేషం. ఇక మొదటి స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజామ్ 873 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ 801 పాయింట్లతో నాలుగవ, ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. లంకతో జరిగిన తొలి వన్డేలో అర్ధ శతకం చేసిన శిఖర్ ధావన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 16వ స్థానంలో నిలిచాడు.
ఇక బౌలర్ల విభాగంలో భారత్ నుంచి బుమ్రా 683 పాయింట్లతో 6వ స్థానంలోనిలిచాడు. బుమ్రా ఒక్కడే టాప్–10లో ఉన్నాడు. తొలి స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు. తొలి స్థానంలో షకిబ్ అల్ హసన్ 416 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Shakib Al Hasan makes massive gains in the latest @MRFWorldwide ICC Men’s ODI Player Rankings for bowling ?
Full list: https://t.co/Wu0HhMH6O3 pic.twitter.com/J4Zw22b02t
— ICC (@ICC) July 21, 2021
Pakistan wicketkeeper-batsman Mohammad Rizwan breaks into the top 10 of the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings for batting ?
Full list: https://t.co/77cLFa815E pic.twitter.com/T0AG8bwI8t
— ICC (@ICC) July 21, 2021
Also Read:
Tokyo Olympics 2021: బిజిబిజీగా భారత క్రీడాకారులు.. ప్రాక్టీస్‌లో లీనమైన అథ్లెట్లు.. పతకాలపై కన్ను!
డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ చేయలేదు.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.. ఎందుకో తెలుసా!