డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ చేయలేదు.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.. ఎందుకో తెలుసా!

సాధారణంగా మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసినవారికి, లేదా అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడికి, లేదా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌కు..

  • Publish Date - 8:38 am, Thu, 22 July 21
డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ చేయలేదు.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది.. ఎందుకో తెలుసా!
Cricket

సాధారణంగా మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసినవారికి, లేదా అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడికి, లేదా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇస్తారు. అయితే ఇక్కడొక ఆటగాడు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమి ఇవ్వలేదు. బ్యాటింగ్‌కు బరిలోకి దిగి డకౌట్‌గా వెనుదిరిగాడు. బౌలింగ్ చేయలేదు. కేవలం ఒక్క క్యాచ్ మాత్రమే పట్టుకున్నాడు.. అయినా అతడికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇచ్చి సత్కరించారు. అది ఎందుకో తెలుసా.? ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.!

బెన్సన్ & హెడ్జెస్ కప్ టైటిల్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వార్విక్‌షైర్, లాంకాషైర్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ జూలై 21, 1984న లార్డ్స్ మైదానంలో జరిగింది. ఇందులో వార్విక్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేసి 50.4 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆల్విన్ కలిచరన్ ఏడు ఫోర్లతో 70 పరుగులు చేయగా.. అతడితో పాటు మరో ఇద్దరు ప్లేయర్స్ రెండంకెల స్కోర్లను చేరుకోగలిగారు. ప్రత్యర్ధి బౌలర్లలో పాల్ అలోట్, స్టీఫెన్ జెఫరీస్ మూడేసి వికెట్లు పడగొట్టగా, మైక్ వాట్కిన్సన్, స్టీవ్ ఓ షాగ్నెస్సీ చెరో రెండు వికెట్లు తీశారు.

టీంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. ఫైనల్‌కు చేరుకున్నందుకు..

వార్విక్‌షైర్ నిర్దేశించిన 140 పరుగుల టార్గెట్‌ను లాంక్షైర్ జట్టు 42.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చేధించింది. ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్ నీల్ ఫెయిర్ బ్రదర్ 49 బంతుల్లో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే డేవిడ్ హ్యూస్(35*), అలాన్ ఓరోడ్(24), స్టీవ్ ఓ షాగ్నెస్సీ(22) రాణించారు.

ఇదిలా ఉంటే లాంక్షైర్ జట్టు కెప్టెన్ జాన్ అబ్రహం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి డకౌట్ కాగా.. మ్యాచ్ అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. అతడి కెప్టెన్సీలో లాంక్షైర్ జట్టు ఫైనల్ వరకు రావడమే కాకుండా.. టైటిల్ కూడా గెలిచింది. అందుకే జాన్ అబ్రహంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!