- Telugu News Photo Gallery Cricket photos Ind vs sl team indias rare record against sri lanka not encountered in it for 24 years
IND vs SL: శ్రీలంకపై టీమిండియా అరుదైన రికార్డు.. 24 ఏళ్లుగా అందులో ఎదురేలేదు!
రెండో వన్డేలో భారత్ శ్రీలంకను 3 వికెట్ల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ జులై 23 న జరుగనుంది.
Updated on: Jul 22, 2021 | 7:47 AM

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్ ఉండగానే వన్ేడ సిరీస్‌ను గెలుచుకుంది. దీపక్ చాహర్ 69 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను ఓటమి నుంచి కాపాడాడు. ఈ విజయంతో టీమిండియా కొన్ని రికార్డులను సాధించింది. అవేంటో చూద్దాం..

శ్రీలంకతో జరిగిన వన్డేల్లో టీమిండియాకు ఇది 93 వ విజయం. ఒక జట్టుతో అత్యధిక వన్డే మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డును సృష్టించింది. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 92 విజయాలు సాధించింది. అంతకుముందు ఈ రికార్డు భారత్(శ్రీలంకపై 92 విజయాలు), ఆస్ట్రేలియా(న్యూజిలాండ్‌పై 92 విజయాలు), పాకిస్తాన్(శ్రీలంకపై 92 విజయాలు) జట్ల పేరిట సంయుక్తంగా ఉంది.

స్వదేశంలోనే శ్రీలంకపై టీమిండియా వరుసగా 10 వన్డేల్లో విజయం సాధించింది. 2012 నుంచి శ్రీలంకలో భారత్ ఒక్క వన్డే కూడా ఓడిపోలేదు.

శ్రీలంకపై టీమిండియా వరుసగా 9 వన్డే సిరీస్‌లను గెలిచింది. 1997 నుంచి శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లన్ని భారత్ వశమవుతున్నాయి. 1997 లో శ్రీలంక పర్యటనలో టీమిండియా 0-3 తేడాతో ఓడిపోయింది.

టీమిండియా గత టీ20 సిరీస్ నుంచి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. వన్డే, టెస్ట్, టీ20 సిరీస్‌లతో సహా భారత్ వరుసగా 18 విజయాలు సాధించగా, రెండు మ్యాచులు డ్రాలు మిగిలాయి.





























