అప్పటి మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236 పరుగులు చేసింది. ధావన్, రోహిత్ మంచి ఆరంభం అందించినా.. అనంతరం టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. 131 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ఈ సమయంలో ధోనీ 45 పరుగులు, భువనేశ్వర్ 53 పరుగులు చేయడంతో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.