బికినీలకు బదులు షార్ట్‌లు వేసుకుంటారా.. అయితే ఫైన్ కట్టండి.. నార్వే జట్టుకు షాకిచ్చిన యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్
యూరోసియన్ మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పాల్గొన్న నార్వే జట్టుకు యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) ఓ విషయంలో షాకిచ్చింది. దీంతో ఈహెచ్ఎఫ్‌పై భారీగా విమర్శలు వస్తున్నాయి.
European Handball Federation: యూరోసియన్ మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పాల్గొన్న నార్వే జట్టుకు యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) ఓ విషయంలో షాకిచ్చింది. దీంతో ఈహెచ్ఎఫ్‌పై భారీగా విమర్శలు వస్తున్నాయి. క్రీడాకారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. బల్గేరియాలో జరిగిన మ్యాచులో స్పెయిన్‌తో నార్వే జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచులో నార్వే టీం మహిళలు షార్ట్‌లు ధరించి పాల్గొన్నారు. అయితే ఏంటంటరా..? వివాదానికి కారణమైందే ఈ షార్ట్‌లు. ఈ టోర్నీలో పాల్గొనే అథ్లెట్లు కచ్చితంగా బికినీలు ధరించాలనే రూల్ ఉంది. కానీ, నార్వే టీం సభ్యులు బికినీలకు బదులు షార్ట్‌లు ధరించి బరిలోకి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఈహెచ్ఎఫ్ నార్వే టీంకు భారీగా జరిమానా విధించింది. నిబంధనలకు వ్యతిరేకంగా దుస్తులు ధరించినందుకు డిసిప్లినరి యాక్షన్ కింద 1500 యూరోలు ఫైన్ కట్టాలని ఆదేశించింది.
అయితే యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ వెలువరించిన ఈ నిర్ణయంపై నార్వే జట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. డ్రెస్ కోడ్ విషయంలో 2006 నుంచి పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటగాళ్లు తమకు అనుకూలమైన దుస్తులు ధరించేందుకు కూడా హక్కులు లేవా అంటూ అసంహనం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉందని పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంలో ఈహెచ్‌ఎఫ్ దూకుడుగా ప్రవర్తిస్తోందని, అనవసరంగా ఇలాంటి రూల్స్ పెట్టి, ఫైన్ విధించడం ఏంటంటూ వాదిస్తున్నారు. ఈహెచ్ఎఫ్ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఉంటామని, ప్లేయర్స్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. జరిమానాను తామే చెల్లిస్తామని పేర్కొంది.
Also Read:
ICC Rankings: ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ
Tokyo Olympics 2021: బిజిబిజీగా భారత క్రీడాకారులు.. ప్రాక్టీస్‌లో లీనమైన అథ్లెట్లు.. పతకాలపై కన్ను!