IND vs SL 1st T20: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 126 పరుగులకు ఆలౌట్
IND vs SL 1st T20: వన్డే సిరీస్ పూర్తయిన తరువాత భారత్, శ్రీలంక మధ్య మూడు టీ 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భాగంగా తొలి మ్యాచ్ కొలంబోలోని ప్రేమ్‌దాస స్టేడియంలో..
IND vs SL 1st T20: వన్డే సిరీస్ పూర్తయిన తరువాత భారత్, శ్రీలంక మధ్య మూడు టీ 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భాగంగా తొలి మ్యాచ్ కొలంబోలోని ప్రేమ్‌దాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక పై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో తొలి టీ20లో టీమ్ ఇండియా 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 126 పరుగులకు అలౌంట్ అయ్యింది. భారత జట్టు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక కూడా గత రెండు మ్యాచ్‌లలో మెరుగుపడింది. అలాంటి పరిస్థితిలో ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటగా శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ గా మొదటిసారి బ్యాటింగ్‌కి దిగిన పృథ్వీ షా మొదటి బంతికే ఔటయ్యాడు. దీంతో బరువు మొత్తం కెప్టెన్ శిఖర్ ధావన్‌పై పడింది. దీంతో సంజు శాంసన్, శిఖర్ దావన్ నిలకడగా ఆడారు. అనంతరం హసరంగ బౌలింగ్‌లో సంజు శాంసన్ 27 పరుగులు ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యదావ్ దాటిగా ఆడటం ప్రారంభించాడు. ఇతడికి ధావన్ తోడవడంతో స్కోరు బోర్డు పరుగెత్తింతి. ఈ క్రమంలో భారీ షాట్‌కి యత్నించిన శిఖర్ ధావన్ 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం యదవ్ హాప్ సెంచరీ పూర్తి చేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లులతో 50 పరుగులు చేసి షాట్‌కి ప్రయత్నించి 15 ఓవర్లో 4 వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య 10 పరుగులు చేసి ఔట్ కాగా చివరలో ఇషాన్ కిషన్ చివరలో మెరిపించాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. శ్రీలకం లక్ష్యం 165 పరుగులుగా నిర్ణయించింది.
భారతదేశం: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (వికె), సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి , యుజ్వేంద్ర చాహల్.
శ్రీలంక: దాసున్ షానకా (కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (డబ్ల్యుకె), అషేన్ బండారా, ధనంజయ్ డి సిల్వా, చరిత్ అసాలంకా, చమికా కరుణరత్నే, వనిందు హసరంగ, ఇసురు ఉదనా, దుష్మంత చమీరా మరియు అకిలా ధనంజయ్.
Hello & Good Evening from Colombo! ?
Sri Lanka have won the toss & elected to bowl against #TeamIndia in the T20I series opener. #SLvIND
Follow the match ? https://t.co/GGk4rj2ror
Here’s India’s Playing XI ? pic.twitter.com/hUy5WRptfp
— BCCI (@BCCI) July 25, 2021
LIVE NEWS & UPDATES
-
భారత్ ఘన విజయం
శ్రీలంకతో తొలి టీ20లో టీమ్ ఇండియా 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 126 పరుగులకు అలౌంట్ అయ్యింది. భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు.
-
బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక.. 3 ఓవర్లకు 25 పరుగులు
బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక లక్ష్యచేధనలోకి బరిలోకి దిగింది. 3 ఓవర్లకు 1 వికెట్ నష్టపోయి 25 పరుగులు చేసింది.
-
-
20 ఓవర్లకు భారత్ 164/5
భారత్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. శ్రీలకం లక్ష్యం 165 పరుగులుగా నిర్ణయించింది. సూర్యకుమార్ హాఫ్ సెంచరీ చేయగా ధావన్ 46 పరుగులతో రాణించాడు. ఇషాన్ కిషన్ చివరలో మెరిపించాడు. లాస్ట్ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
-
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య 10 పరుగులు ఔటయ్యాడు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ ఔట్
భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు ఔట్ అయ్యాడు. 15.2 ఓవర్లలో భారీ షాట్ ఆడబోయి సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ రమేశ్ మెండిస్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య ఉన్నారు.
-
-
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. కాగా భారత్ 15.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
-
ధావన్ ఔట్ .. మూడో వికెట్ కోల్పోయిన భారత్..
భారత్ మూడో వికెట్ కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ 46 పరుగులు ఔటయ్యాడు. కరుణరత్న బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించిన ధావన్ బండారకి దొరికిపోయాడు. దీంతో భారత్ 14.1 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
-
100 పరుగులు దాటిన భారత్
భారత్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 42 పరుగులు, సూర్యకుమార్ 31 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
5⃣0⃣-run stand between @SDhawan25 & @surya_14kumar! ? ?
1⃣0⃣0⃣ up for #TeamIndia after 12 overs. ? ? #SLvIND
Follow the match ? https://t.co/GGk4rj2ror pic.twitter.com/rT9BzlTEWv
— BCCI (@BCCI) July 25, 2021
-
11 ఓవర్లో సిక్స్ కొట్టిన శిఖర్ ధావన్
ధనంజయ వేసిన 11 ఓవర్ రెండో బంతిని శిఖర్ ధావన్ సిక్స్ కొట్టాడు. 28 బంతుల్లో 40 పరుగులు హాఫ్ సెంచరీ దిశగా ఆడుతున్నాడు.
-
10 ఓవర్లకు భారత్ 78/2
10 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 27 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులు ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్..
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సంజు శాంసన్ 27 పరుగులు ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది.
-
35 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం
సంజు శాంసన్ , శిఖర్ దావన్ 35 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.
-
సంజు శాంసన్ మొదటి సిక్స్
ధనంజయ బౌలింగ్‌లో సంజు శాంసన్ మ్యాచ్‌లో మొదటి సిక్స్ బాదాడు. దీంతో భారత్ 50 పరుగులు దాటింది. సంజు శాంసన్ 26 పరుగులు, శిఖర్ దావన్ 22 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
-
5 ఓవర్లకు భారత్ 35/1.. మందకొడిగా బ్యాటింగ్
భారత్ 5 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. సంజు శాంసన్ 12 పరుగులు, శిఖర్ దావన్ 22 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. బ్యాటింగ్ మందకొడిగా సాగుతుంది.
-
ధాటిగా ఆడుతున్న శిఖర్ ధావన్
భారత్ 4 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. సంజు శాంసన్ 10 పరుగులు, శిఖర్ దావన్ 19 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
-
3 ఓవర్లకు భారత్ 18/1
భారత్ 3 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. సంజు శాంసన్ 10 పరుగులు, శిఖర్ దావన్ 8 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
-
2 ఓవర్లకు భారత్ 12/1
భారత్ 2 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. సంజు శాంసన్ 9 పరుగులు, శిఖర్ దావన్ 7 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
-
మొదటి బంతికే వికెట్..
భారత్ మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. షాట్ ఆడటానికి ప్రయత్నించి కీపర్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ పరుగులు ప్రారంభించకముందే వికెట్ కోల్పోయింది.
Golden duck on T20I debut for India:
KL Rahul v Zim, Harare, 2016 Prithvi Shaw v SL, Colombo, 2021*#INDvSL #SLvIND
— Umang Pabari (@UPStatsman) July 25, 2021
Published On - Jul 25,2021 11:41 PM