Guidelines on Floods: వరదలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతూ లేఖని రిలీజ్ చేసిన విపత్తుల శాఖ

Guidelines on Floods: ఓ వైపు కరోనా వైరస్ కల్లోలం.. మరో వైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వర్షాలు,..

Guidelines on Floods: వరదలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతూ లేఖని రిలీజ్ చేసిన విపత్తుల శాఖ
Ap Floods
Follow us
Surya Kala

|

Updated on: Jul 25, 2021 | 9:24 PM

Guidelines on Floods: ఓ వైపు కరోనా వైరస్ కల్లోలం.. మరో వైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధులు కూడా విరజంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏపీ ప్రభుతం చర్యలు చేపట్టింది. తాజాగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ కోవిడ్-19 నియమాలు పాటిస్తూ సహాయక చర్యల్లోని అధికారులకు సహకరించండని సూచిస్తూ ప్రజలకు ఓ లేఖను రిలీజ్ చేసింది. అంతేకాదు.. ప్రజలు వరదల సమయంలో ఏమి చేయాలి.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.. ఒకవేళ వరదలు లోతట్టు ప్రాంతాలకు వస్తే.. అక్కడ ప్రజలు ఏ విధమైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఓ లేఖను రిలీజ్ చేశారు

వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

•వరదనీటిలోకి ప్రవేశించవద్దు. •మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి. •విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్ లైన్ల కు దూరంగా ఉండండి. •ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్ ను గుర్తించి ఆ ప్రదేశం లొ కనిపించే విదంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి. •వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, *రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు •తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. *తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి •వేడిచేసిన లేదా క్లోరినేటెడ్ నీరు త్రాగాలి. •మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి.

వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు

•మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి •రిపేర్ కు వచ్చిన విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు •అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను, ఎలక్ట్రిక్ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి *తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు. •విరిగిన విద్యుత్ స్తంభాలు , తీగలు, పదునైన వస్తువులను పరిశీలించండి •వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు. •మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి. •వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి. •నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి. •నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.

మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసి వస్తే

•మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి. •టాయిలెట్ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి •మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి •ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. •మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి. • నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి. •అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. •కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. •తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.

Also Read: Lashkar Bonalu: బోనమెత్తిన భాగ్య నగరం..బారులు తీరిన జనం, జాతరలో ఆకట్టుకుంటున్న పోతురాజు విన్యాసాలు