AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannah: మెగాహీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌‌‌‌‌లో మెరవనున్న మిల్కీబ్యూటీ ..?

టాలీవుడ్  మిల్కీ బ్యూటీ తమన్నా దూకుడు ప్రస్తుతం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. బాహుబలి సినిమా వరకు ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోయింది.

Tamannah: మెగాహీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌‌‌‌‌లో మెరవనున్న మిల్కీబ్యూటీ ..?
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2021 | 4:42 PM

Share

Tamannah: టాలీవుడ్  మిల్కీబ్యూటీ తమన్నా దూకుడు ప్రస్తుతం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. బాహుబలి సినిమా వరకు ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రెచ్చిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో తమన్నా నుంచి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. హీరోయిన్  గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌‌‌తో కూడా అలరిస్తోంది ఈ చిన్నది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు శీను సినిమాలో స్పెషల్ సాంగ్‌‌‌‌లో మొదటిసారి కనిపించింది. ఆ తర్వాత గతంలో జై లవకుశ, కేజీఎఫ్ మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్‌‌‌తో ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు మెగా హీరో సినిమాలో ఐటెమ్ సాంగ్‌‌లో మెరవబోతుంది ఈ బ్యూటీ.

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న గని సినిమాలో తమన్నా అదిరిపోయే ఐటమ్ సాంగ్‌‌‌లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న గని సినిమా షూటింగ్ స్పాట్‌‌‌‌లో తమన్నా కనిపించడంతో ఆమె ఐటెం సాంగ్‌‌‌ చేస్తుందనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాడ్రాప్ లో రాబోతోన్న గని సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నాడు వరుణ్. ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.  ప్రస్తుతం సత్యదేవ్ నటిస్తున్న గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3, సీటీమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ.. మాస్టర్ చెఫ్ టీవీ షో కు హోస్టింగ్ చేస్తోంది తమన్నా. మరి గని సినిమాలో తమన్నా ఐటెమ్ సాంగ్ పై త్వరలోనే క్లారిటీ  వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kaikala Satyanarayana Birthday: సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్

Balakrishna: వరస సినిమాలతో బాలయ్య బిజిబిజీ … అనిల్ రావిపూడితో సినిమా లేట్ అయ్యే ఛాన్స్

Priya Varrier Saree Dance: అర్ధరాత్రి రష్యా రోడ్లపై చీరకట్టుతో రచ్చ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌