AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: వరస సినిమాలతో బాలయ్య బిజిబిజీ … అనిల్ రావిపూడితో సినిమా లేట్ అయ్యే ఛాన్స్

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలతో బిజిబిజీ కానున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి సినిమా 'అఖండ'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా క్లైమాక్స్..

Balakrishna: వరస సినిమాలతో బాలయ్య బిజిబిజీ ...  అనిల్ రావిపూడితో సినిమా లేట్ అయ్యే ఛాన్స్
Balayya Anil
Surya Kala
|

Updated on: Jul 25, 2021 | 3:13 PM

Share

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలతో బిజిబిజీ కానున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి సినిమా ‘అఖండ’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తచేసుకుని గుమ్మడికాయ కొట్టనున్నారు. కుదిరితే దసరాకి ముందుగా, లేదంటే సంక్రాంతి రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే మిగతా పనులు కూడా జరుగుతున్నాయి.

అఖండ తర్వాత బాలకృష్ణ..గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. గోపీచంద్ కూడా బాలయ్యబాబుతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌‌గానే రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసుకుని గోపీచంద్ మలినేని సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టును అనిల్ రావిపూడితో చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే బాలయ్య చెప్పిన మార్పులు చేర్పులు చేయడానికి అనిల్‌‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల పూరి స్పీడ్ గురించి తెలిసిన బాలకృష్ణ, ముందుగా ఆయన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారని టాక్‌ వినిపిస్తోంది.

మొత్తంమీద పూరి సినిమా తర్వాతే అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఉంటుందని సమాచారం. ఇకపోతే గతంలో బాలాయ్య- పూరి కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ మూవీ.. నందమూరి మాస్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో ముఖ్యంగా బాలకృష్ణ లుక్..మాస్‌ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ సినిమా చేసే టైమ్‌లోనే బాలయ్యతో మరో సినిమా చేస్తానని పూరి కమిట్ అయ్యారట. ఈ క్రమంలోనే అనిల్ సినిమా కంటే ముందే పూరి సినిమా వచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. అటు బాలయ్య కూడా అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.

Also Read: నిర్మాత బన్నీ వాసు ఆవేదన.. ఏకంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ

రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు ! పోర్న్ కేసులో సాక్షులుగా మారిన నలుగురు ఉద్యోగులు

పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో