రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు ! పోర్న్ కేసులో సాక్షులుగా మారిన నలుగురు ఉద్యోగులు

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఆయన కంపెనీలో పనిచేస్తున్న వారిలో నలుగురు ఉద్యోగులు ఈ కేసులో తాము సాక్ష్యం చెబుతామంటూ పోలీసుల ముందుకు వచ్చారు. వీరిసాక్ష్యం ఈ కేసులో అతి కీలకం కానుందని క్రైమ్ బ్రాంచ్...

రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు ! పోర్న్ కేసులో సాక్షులుగా మారిన నలుగురు ఉద్యోగులు
Raj Kundra

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఆయన కంపెనీలో పనిచేస్తున్న వారిలో నలుగురు ఉద్యోగులు ఈ కేసులో తాము సాక్ష్యం చెబుతామంటూ పోలీసుల ముందుకు వచ్చారు. వీరిసాక్ష్యం ఈ కేసులో అతి కీలకం కానుందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. కుంద్రాతో బాటు ఈ కేసులో అరెస్టయిన ఇతరులు తమకు తగినంతగా సహకరించకపోవడంతో.. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు వీరి సాక్ష్యం తమకు ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. వీరి ద్వారా కుంద్రాకు సంబంధించిన బిజినెస్, ఫైనాన్షియల్ డీటైల్స్, ఈ రాకెట్ లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న విషయాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఉగ్ద్యోగుల స్టేట్ మెంట్ ను మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనున్నారు.

కుంద్రాకు చెందిన రెండు కంపెనీల ఉద్యోగుల్లో మరి కొందరు కూడా ఇలాగే సాక్ష్యం చెబుతామని ముందుకు రావచ్చునని భావిస్తున్నారు.. కాగా-అంధేరీ వెస్ట్ లో కుంద్రా కార్యాలయం..వియాన్ సంస్థలో పోలీసులు మళ్ళీ జరిపిన సోదాలో…రహస్యంగా దాచిన లాకర్ ను వారు కనుగొన్నారు. ఇందులో అతని బిజినెస్ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మొదట నిర్వహించిన రైడ్ లో ఈ లాకర్ ని వీరు కనుగొనలేకపోయారు. మరోవైపు.. తన అరెస్టు అక్రమమని కుంద్రా బాంబేహైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అతని లాయర్ కూడా స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో వేసిన మరో పిటిషన్ లో తన క్లయింటు నిర్దోషి అని, ఆయన రూపొందించిన వీడియోలు అశ్లీలమైనవి కావని పేర్కొన్నారు. ఏమైనా కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్నది ఖాయం..

మరిన్ని ఇక్కడ చూడండి : రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.

 వనితా విజయ్‌‌కుమార్ కు నాలుగో పెళ్లా..?వైరల్ అవుతున్న వనితా విజయ్‌‌‌‌కుమార్ ఫోటోలు..:Vanitha Vijayakumar Video.

 వెంటిలేటర్‌‌పై భర్త.. వీర్యం సేకరించిన రెండ్రోజులకే మృతి… భర్త వీర్యం కోసం కోర్టుకెక్కిన భార్య..:collects covid-19 patient sperm Video.

 డేంజర్ అంచుకి..ఆస్ట్రేలియా పగడాల దీవి..!దీనికి కారణం ఏంటో తెలుసా ..?:Australia Great Barrier Reef Video.

Click on your DTH Provider to Add TV9 Telugu