AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చోర్ బజార్’లో గన్ పట్టుకొని నిలుచున్న ఆకాష్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్..

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలో నటించిన ఆకాష్.

'చోర్ బజార్'లో గన్ పట్టుకొని నిలుచున్న ఆకాష్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్..
Akash
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2021 | 7:05 PM

Share

Akash Puri: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌గా చాలా సినిమాలో నటించిన ఆకాష్. మెహబూబా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్రహీరో.. త్వరలో రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో నేడు ఆకాష్ పుట్టిన రోజు కానుకగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దళం- జార్జ్ రెడ్డి సినిమాలతో తనదైన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు చోర్ బజార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌‌‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్‌‌‌గా నటిస్తుంది. తాజాగా విడుదలైన ఫస్ట్‌‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది.

ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌‌‌కు తగ్గట్టే ఫస్ట్‌‌లుక్‌‌లో సూపర్ మాస్‌‌గా కనిపిస్తున్నాడు ఆకాష్. బైక్ పక్కనే నిలుచున్న ఆకాష్ చేతిమీద `బచ్చన్ సాబ్` పేరుతో టాట్టూ కనిపిస్తోంది. మరో చేత్తో గన్ పట్టుకున్న పోస్టర్ ఎంతో అగ్రెస్సివ్‌‌‌గా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే షురూ అయ్యింది. మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్ లో శరవేగంగాజరుగుతోందట. ఈ సినిమాతో ఆకాష్ మరో హిట్‌‌‌‌ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ముచ్చటగా మూడోసారి మహేష్ సరసన చెన్నైచంద్రం.. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా..

‘ఛత్రపతి సూరీడు’ ఇప్పుడు ఎలా ఉన్నడో చూశారా..? షాకింగ్ లుక్.. వైరల్ అవుతోన్న ఫోటో..

Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్