AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Karthik Ratnam: ఒక్క ఛాన్స్.. ఆ హీరో తో ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నారప్ప తనయుడు

Actor Karthik Ratnam: కళాకారులకు ముఖ్యగా నటీనటులకు కష్టానికి తగిన ఫలితం గుర్తింపు తెచ్చుకోవడానికి సమయం పట్టవచ్చు.. ఒక్కసారి తనకంటూ స్పెషల్ పంథాని క్రియేట్ చేసుకుంటూ..

Actor Karthik Ratnam: ఒక్క ఛాన్స్..  ఆ హీరో తో ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నారప్ప తనయుడు
Karthik Ratnam
Surya Kala
|

Updated on: Jul 25, 2021 | 6:59 PM

Share

Actor Karthik Ratnam: కళాకారులకు ముఖ్యగా నటీనటులకు కష్టానికి తగిన ఫలితం గుర్తింపు తెచ్చుకోవడానికి సమయం పట్టవచ్చు.. ఒక్కసారి తనకంటూ స్పెషల్ పంథాని క్రియేట్ చేసుకుంటూ తనదైన శైలితో నటించి గుర్తింపు తెచ్చుకుంటే.. వాళ్ళ పేరు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి.. కార్తీక్ రత్నం.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కార్తీక్‌ రత్నం పేరు బాగా వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా కార్తీక్ రత్నం విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందే సినిమాల కోసం ఆయనను తీసుకుంటున్నారు. ఆ తరహా పాత్రలు ఆయనకు బాగా నప్పుతుండటమే అందుకు కారణం. కార్తీక్ రత్నం అనగానే ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమా హిట్ కావడమే కాకుండా, ఆయనకి మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ‘అర్థ శతాబ్దం’మూవీతో ఆయన క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ రెండు సినిమాల వల్లనే కార్తీక్‌కు ‘నారప్ప’ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది.

నారప్పలో కార్తీక్‌ రత్నం.. వెంకటేశ్ పెద్దకొడుకు ‘మునికన్న’ పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూ తిరగడం వలన ఒక్క సారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల నారప్పలో తన క్యారెక్టర్‌పై స్పందించిన కార్తీక్‌.. నేచురల్‌ స్టార్‌ నాని నటన అంటే తనకు చాలా ఇష్టమని..ఆయనతో కలిసి ఒక్క సీన్ చేసినా చాలు” అన్నారు. మరి కార్తీక్‌ రత్నంకు నానితో కలిసి నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

Also Read: Singiri Kona Temple: చిత్తూరు జిల్లాలో పులి కలకలం..సింగిరికోన ఆలయానికి వెళ్తున్న భక్తులపై దాడి