Singiri Kona Temple: చిత్తూరు జిల్లాలో పులి కలకలం..సింగిరికోన ఆలయానికి వెళ్తున్న భక్తులపై దాడి

Singiri Kona Temple: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నారాయణనవనం మండలంలోని పులి కలకలం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న వాహదారులపై..

Singiri Kona Temple: చిత్తూరు జిల్లాలో పులి కలకలం..సింగిరికోన ఆలయానికి వెళ్తున్న భక్తులపై దాడి
Tiger Attack
Follow us
Surya Kala

|

Updated on: Jul 25, 2021 | 6:44 PM

Singiri Kona Temple: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నారాయణనవనం మండలంలోని పులి కలకలం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న వాహదారులపై దాడి చేసి గాయపరిచింది. పులి దాడిలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే

జిల్లాలోని వడమాలపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం నాయుడు,మంజులా దేవి దంపతులు ద్విచక్రవాహనంపై నారాయణనవనం మండలంలోని సింగిరికోన ఆలయానికి బయల్ధేరారు. అయితే సింగిరికోన ఆలయానికి వెళ్ళే మార్గం మధ్యలో ఈ దంపతులపై పులి దాడి చేసింది. బైక్ పై వెళ్తున్న వీరిపై చెట్టుపై నుండి పులి వీరిపై దూకిందని.. అదే సమయంలో వెనుక నుండి కారు రావడంతో పులి భయపడి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.

పులి దాడి చేయడంతో ఆ దంపతులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో పులి తప్పించుకొని వెళ్లిపోయింది. చిరుత దాడిలో మహిళ కంటికి గాయాలయ్యాయి. ఆమె భర్త వీపునకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.స్తానికులు స్పందించి వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి దాడిలో గాయపడిన దంపతులు పుత్తూరు లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతున్న సుబ్రమణ్యం నాయుడు,మంజులా దేవి దంపతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కోన్నారు.

Also Read: ఓ వైపు ఆస్ట్రేలియా చేతిలో భారీతేడాతో భారత హాకీ జట్టు ఓటమి.. మరోవైపు తొలిరౌండ్‌లోనే ఓడిన బాక్సర్ మనీష్