Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకేయూ పరిచయం అయ్యింది అందాల నిధి అగర్వాల్. మొదటి సినిమాతో క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళ

Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ
Nidhhi Agerwal
Follow us

|

Updated on: Jul 25, 2021 | 7:29 PM

Nidhhi Agerwal: యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల నిధి అగర్వాల్. మొదటి సినిమాతో క్యూట్ లుక్స్‌‌‌‌‌తో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ఆ తర్వాత చైతన్య బ్రదర్ అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు నిధికి ఆశించిన స్థాయి సక్సెస్‌‌‌‌‌ను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో  డేరింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడికి సాలిడ్ సక్సెస్‌‌‌ను తెచ్చిపెట్టింది. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నిధి అందాల ఆరబోతుకు ఫిదా కానీ కురాడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ అమ్మడికి ఇస్మార్ట్ ఇచ్చిన హిట్ మరింత క్రేజ్‌‌‌‌ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే తమిళ్‌‌‌‌‌లోనూ అడుగు పెట్టింది. అక్కడ స్టార్ హీరో శింబు సరసన నటించి సక్సెస్ అందుకుంది. దాంతో.. ఇటు తెలుగు అటు తమిళ్ నుంచి ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కట్టాయి.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది నిధిఅగర్వాల్. అయితే ఈ అమ్మడికి వాన పాటలంటే అస్సలు ఇష్టం లేదట. వాన పాటలు చేయడం అంత ఈజీ కాదు అంటుంది అందాల నిధి. వాన పాటల్లో యాక్ట్ చేయాల్సి వస్తే నో చెప్తానంటుంది ఈ చిన్నది. వాన చినుకులు పడుతుంటే.. కళ్లు తెరిచి ఉంచి.. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం.. నటించటం అంత ఈజీ కాదని అంటుంది ఈ సుందరి. వీలైనంత వరకు వాన పాటలకు దూరంగా ఉంటా అంటుంది నిధి అగర్వాల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘చోర్ బజార్’లో గన్ పట్టుకొని నిలుచున్న ఆకాష్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్..

Actor Karthik Ratnam: ఒక్క ఛాన్స్.. ఆ హీరో తో ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నారప్ప తనయుడు

ముచ్చటగా మూడోసారి మహేష్ సరసన చెన్నైచంద్రం.. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా..