Ration Cards : పేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం .. రేపే ముహూర్తం

పేదల కడుపు నింపే యజ్ణానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్నార్థులు, అనాదలుండని తెలంగాణను కలగన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో..

Ration Cards : పేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం .. రేపే ముహూర్తం
Gangula

Ration Cards – Telangana – Gangula : పేదల కడుపు నింపే యజ్ణానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్నార్థులు, అనాదలుండని తెలంగాణను కలగన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే అప్లై చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులను జారీచేసే ప్రక్రియను పౌరసరఫరాల శాఖ చేపట్టింది. ఈ మేరకు 26వ తారీఖు సోమవారం రోజున, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఉదయం లాంచనంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించబోతున్నారు.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతీ మండలం కేంద్రంగా లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించబోతున్నారని మంత్రి గంగుల కమలాకర్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లకేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేశామన్నారు.

3 లక్షల 9 వేల 83 అప్లికేషన్లు అర్హత సాధించాయని, 8,65,430 మంది లబ్దిదారులు నూతనంగా ప్రతీ నెల 6కిలోల బియ్యాన్ని పొందనున్నారని మంత్రి తెలియజేసారు. ఇందుకు గానూ నెలకు 5,200 మెట్రిక్ టన్నులతో సంవత్సరానికి 62,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనుందని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీనెల 14 కోట్ల రూపాయలతో సంవత్సరానికి దాదాపు 168 కోట్ల రూపాయల్ని అదనంగా వెచ్చించనుందన్నారు.

నూతన రేషన్ కార్డులలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాలో ఉన్నాయన్నారు. పాతవి దాదాపు 87.41 లక్షల కార్డులు, లబ్దీదారులు 2కోట్ల 79 లక్షల 23 వేలకు అదనంగా కొత్త కార్డులతో కలిపి ప్రస్థుతం రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు, లబ్దీదారులు 2కోట్ల 88లక్షల మంది ఉన్నారు. ప్రతినెల దాదాపు 231 కోట్లతో సంవత్సరానికి 2766 కోట్ల రూపాయల్ని ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Read also : Revanth Reddy : ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తాం : రేవంత్ రెడ్డి

Click on your DTH Provider to Add TV9 Telugu